శ్రీ వసిష్ఠామృతం
శ్రీ వసిష్ఠులవారు, శ్రీరాములవారు విషాద, వైరాగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు గావించిన విస్తారమైన, విశేషమైన “జ్ఞానబోధే” వసిష్ఠగీత లేదా యోగవాసిష్ఠం. శ్రీమద్భగవత్ గీతకు యోగ వాసిష్ఠం మూలగ్రంథం అని చెప్పుకోవచ్చు. శుక బ్రహ్మాశ్రమం వారు ప్రచురించిన యోగవాసిష్ఠ రత్నాకరం లోంచి “నన్ను ఎంతో ఆకర్షించి నా హృదయాన్ని బుద్ధిని నిలిపివేసిన” సుమారు 230 శ్లోకాలను ఈ చిన్ని పుస్తకంలో ప్రచురించడం జరిగింది.
|
శ్వాస విజ్ఞాన జ్యోతి
నూతన విజ్ఞానం కాదు. ఇది సనాతన విజ్ఞానం శ్వాస విజ్ఞానం అంటే… ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు… స్థూలంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దానితో పాటు సూక్ష్మంగా ఉన్న శక్తి తరంగాలు, ఆ శక్తిక్షేత్రం… వీటన్నింటి గురించీ తెలుసుకోవటం అన్నమాట శ్వాస విజ్ఞానం అంటే ధ్యానం యొక్క మూల ప్రక్రియ గురించి సర్వం తెలుసుకోవటం అన్నమాట శ్వాస విద్య గురించి తెలుసుకోవటం అంటే, ధ్యాన విద్య గురించి తెలుసుకోవటం అన్నమాట.
|
శ్రీకృష్ణ సందేశం

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ | సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వాసమత్వం యోగ ఉచ్యతే ||
‘యోగ స్థితి’ లోనే కర్మలన్నీచేయాలి ! ‘యోగస్థితి’ లో వుండకుండా చేసే కర్మలన్నీ అనర్ధహేతువులే !
కర్మలను చేస్తూ వున్నా వాటిపట్ల ఆసక్తి రహితుడిలాగా వుండాలి.
|
సంకల్ప శక్తి
ఈ యొక్క అంశం…సంకల్పశక్తి.. అన్నది జీవితంలో అత్యంత మౌలికమైన విషయం. మనిషి తన ‘సంకల్పశక్తి’ తోనే ‘సృష్టికర్త’ గా విరాజిల్లి ఉన్నవాడు. మనిషే కాదు ఏ ప్రాణి అయినా సరే తన ‘సంకల్పశక్తి’ తోనే ‘కర్త’ గా, ‘సృష్టికర్త’ గా విరాజిల్లి ఉంది.”
|
నవవిధ ధర్మాలు

“ధర్మోరక్షతి రక్షితః” .. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారిచేత రక్షించబడిన ధర్మం తిరిగి వారిని రక్షిస్తుంది” అన్నది సత్యం.
ఈ ప్రపంచంలో రకరకాల ధర్మాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటి గురించి మనం సమగ్రంగా తెలుసుకుంటూ.. సంపూర్ణ అవగాహనతో వాటిని ఆచరిస్తూ… ఈ భూమి మీద మన జీవితాలను పండించుకోవాలి.
జీవితంలో మనకు అభ్యుదయం రావాలన్నా, మనం ప్రగతి పధంలో ఉండాలన్నా, మనకు సౌఖ్యం, ఆనందం, ముక్తి, మోక్షం దుఃఖరాహిత్యం.. ఒకటేమిటి ఏది కావాలన్నా సరే.. త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరించడం తప్ప మనకు వేరే మార్గం లేదు గాక లేదు కనుక ఇంతగా మన జీవితాల్లో …
|
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురువాణి
అనేకమంది మహాత్ములు తమ తమ దివ్య అనుభవాలతో సత్యాన్ని అనేక రుచులతో మనకు వడ్డిస్తున్నారు; వడ్డించారు. అనేక వాసనలతో, గుబాళింపులతో సత్యాన్ని ప్రసాదిస్తారు; ప్రసాదించారు. ఉన్న ఒక్కగానొక్క సత్యాన్ని ఈ రోజు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి యొక్క అత్యద్భుత ప్రబోధాల ద్వారా, వాటి యొక్క అర్ధాలను సేకరించుకుంటూ మనలను మనం ఉద్ధరించుకుందాం.
|
ధ్యానానుభవాలు
ధ్యానం చేస్తే ధ్యానానుభవాలు వస్తాయి. హైదరాబాద్‌కి వస్తే హైదరాబాద్ విశేషాలన్నీ చూడవచ్చు. ఇక్కడి వారందిరితోనూ మాట్లాడవచ్చు. హైదరాబాద్‌కే రాకపోతే ‘చార్మినార్’ ఎలా చూస్తాం? ‘ట్యాంక్‌బండ్’ ఎలా చూస్తాం? ఇక్కడున్న వాళ్ళతో ఎలా మాట్లాడుతాం? కనుక, ముంబాయికి వెళ్తే ముంబాయి విశేషాలూ. ముంబాయి అనుభవాలూ ఉంటాయి. కలకత్తాకు వెళ్తే కలకత్తా అనుభవాలూ వస్తాయి. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ అనుభవాలు వస్తాయి. అలాగే, ధ్యానం చేస్తే ధ్యానానుభవాలు వస్తాయి.
|
ధ్యానం వలన లాభాలు
” ‘ధ్యానం ఎందుకు చేయాలి?’ ‘చేయకపోతే నష్టం ఏమిటి?’ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే. ధ్యానం చేస్తే అన్నీ లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్. మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను. ధ్యానం చేయకపోతే A to Z అన్నీ నష్టాలే. ధ్యానం చేస్తే A to Z లాభాలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే, మరొక్కసారి ప్రణామం చేసి చెప్తున్నాను. ధ్యానం చేయకపోతే లక్షన్నర నష్టాలు. ధ్యానం చేస్తే లక్షన్నర, కోటిన్నర లాభాలు.”
|
ఆత్మవిజ్ఞానం
ఆత్మ విజ్ఞానం స్పిరిచ్యువల్ సైన్స్ – అంటే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం – అదే “ఆత్మవిజ్ఞానం”.
‘జ్ఞానం’ అన్నది వేరే. ‘విజ్ఞానం’ అన్నది వేరే. ‘జ్ఞానం’ అన్నది విజ్ఞానం యొక్క సూక్ష్మరూపమైతే, ‘విజ్ఞానం’ అన్నది జ్ఞానం యొక్క విశ్వరూపం. ఆత్మ యొక్క స్థూల అవగాహన ‘జ్ఞానం’; అయితే ఆత్మ యొక్క విశేష పరిస్థితులను ‘విజ్ఞానం’ లోనే తెలుసుకుంటాం.
|
పిరమిడ్ ఫిలాసఫీ
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మువ్మెంట్ యొక్క మూల సిద్ధాంతాలు, మూల జ్ఞానప్రకాశం గురించి సవివరంగా తెలుసుకుందాం
|
పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు

జ్ఞాన ప్రకరణం మొట్ట మొదటిది – “ఆత్మే పరబ్రహ్మము” | రెండవది – “జీవుడే దేవుడు” మూడవది – “దేహమే దేవాలయం”
సాధనా ప్రకరణం నాల్గవది – “శ్వాసే గురువు” | ఐదవది – “సమయమే సాధన” ఆరవది – “సహనమే ప్రగతి” | ఏడవది – “అనుభవమే జ్ఞానం”
కర్మ ప్రకరణం ఎనిమిదవది – “దానమే ధర్మం” | తొమ్మిదవది – “ధర్మమే పుణ్యం”
|
ముక్తి మార్గం!
“ముక్తి అంటే విడుదల!”
… దేని నుంచి వివుదల?? దుఃఖం నుంచి వివుదల!!!
మనిషి ఎల్లప్పుడూ “ఆనందంగా” జీవించాలి; అంటే మనిషి యొక్క్ శరీరం ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా, తేజోవంతంగా ఉండాలి! అదే విధంగా, మనిషి యొక్క మనస్సు ఎప్పుడూ హాయిగా, ఆనందంగా ఉండాలి; ఇంకా ముందుకుపోతే… మనిషి యొక్క బుద్ధి ఎప్పుడూ సునిశితంగా, సదా సత్యాన్ని చూపేదిగా ఉండాలి!
|
భక్తియే… ముక్తి!
“స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య భిధీయతే!” అని ఉపనిషత్ వాక్యం. అంటే స్వస్వరూపంలో అనుసంధానం… నాతో నేను ఉండడం.. నా గురించి నేను తెలుసుకోవడం, నేను నేనుగా ఉండడం దాని పేరే భక్తి. “స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య భిధీయతే!”… ఇది చాలా, చాలా ముఖ్యమైంది. భక్తి అంటే ఇంకెవడికో మరి మ్రొక్కడం, “బాంచను దొరా కల్మొక్త!” అనడం కాదు. భక్తి అంటే నీ యొక్క శక్తిని తెలుసుకొని ఆ శక్తితో కలిసి ఉండటమే. భక్తి అంటే స్వభక్తి… పరభక్తి కాదు. ధర్మం అంటే స్వధర్మం… పరధర్మం కాదు. వశం అంటే స్వవశం కావాలి… పరవశం కారాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్… భక్తి అంటే స్వంతానికి శరణాగతి కావడం… పరులకు శరణాగతి కావడం కాదు. భక్తియే ముక్తి. స్వస్వరూపానుసంధానమే ముక్తి! ఎక్కడ భక్తి లేదో అక్కడ ముక్తి లేదు. ఎక్కడ స్వస్వరూపానుసంధానం లేదో అక్కడ ముక్తి లేదు! భక్తియే ముక్తి!
|
ఆత్మ విజ్ఞానం
“ఆత్మ విజ్ఞానం” స్పిరిచ్యువల్ సైన్స్ – అంటే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం- అదే “ఆత్మ విజ్ఞానం”. ‘జ్ఞానం‘ అన్నది వేరే. ‘విజ్ఞానం‘ అన్నది వేరే! ‘జ్ఞానం‘ అన్నది విజ్ఞానం యొక్క సూక్షమరూపమైతే, ‘విజ్ఞానం‘ అన్నది జ్ఞానం యొక్క విశ్వరూపం! ఆత్మ యొక్క స్థూల అవగాహన ‘జ్ఞానం‘; అయితే ఆత్మ యొక్క విశేష పరిస్థితులను ‘విజ్ఞానం‘లోనే తెలుసుకుంటాం. ముఖ్యంగా “నేను శరీరం కాదు, ఆత్మను” అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ‘జ్ఞానం‘ అనబడతారు. ‘ఆత్మజ్ఞాని‘ అనబడతారు. ఎవరికైతే ఈ అనుభవం లేదో, “ఈ దేహమే నేను”- అని అనుకుంటారో వారు ఆత్మజ్ఞానులు కారు; వారు ’అజ్ఞానులు’ అని పిలవబడతారు!
|
ఆత్మ క్షేత్రం

సంగీత క్షేత్రముంది. క్రికెట్ క్షేత్రముంది. హాకీ క్షేత్రముంది. ప్రతి ఆట కూడానూ… అదొక పెద్ద క్షేత్రం. సంగీతం నేర్చుకోవాలంటే మరి దానికి మన యొక్క సంసార క్షేత్రం నుంచి బయటికి వచ్చి సంగీత క్షేత్రం లోకి రావాలి. “నేను సంసార క్షేత్రంలో ఉన్నాను. నా పెళ్ళాం, బిడ్డలు ఉన్నారు. నేనెలా సంగీతం నేర్చుకుంటాను?” అంటే, నువ్వెలా నేర్చుకుంటావు? ఒక్ క్షేత్రంలో నుంచి ఇంకొక క్షేత్రంలోకి వెళ్ళాలంటే ఆ క్షేత్రం నుంచి బయటికి రావాలి కదా! శరీర క్షేత్రం నుంచి బయటికి వస్తేనే ఆత్మక్షేత్రం మనకి సువిదితమవుతుంది!
|
అష్టాంగా రాజ యోగం
అన్నింటికన్నా ముఖ్యమైనది “రాజయోగం”. రాజ యోగం అన్నింటికన్న ముఖ్యమైనది కనుకనే దీన్ని రాజ యోగం అన్నరు; అంటే చాల ముఖ్యమైన యోగం అన్నమాట. ఇందులో దేనితో ఏకమై వుంటాం మనం? మన యొక్క అతీంద్రియ శక్తులతో ఏకమై వుంటాం మనం. మన మూడో కన్నుతో మనమ్ ఏకమై వుంటాం. మన సూక్ష్మ శరీర, కారణ శరీర, ఇతర శరీరాలతో మనం సదా ఏకమై వుంటాం. భౌతిక శరీరంతో మనం హఠయోగమైనప్పుడు మన సూక్ష్మశరీరం, కారణ శరీరం, మహా కారణ శరీరాలతో ఏకమై వుండి తత్ లోకాలలో మనం విహరిస్తూ వుండటమే “రాజ యోగం”.
|
“ఆధ్యాత్మిక శాస్త్రం”
“ఆధ్యాత్మిక శాస్త్రం” అన్నది ఆరు సత్యాలతో … ఆరు సిద్ధాంతాలతో … విరాజిల్లుతోంది. ఈ ఆరింటినీ వెరసి “ఆధ్యాత్మిక శాస్త్రం”గా మనం అర్ధం చేసుకుందాం. ఏదైతే మనకు అర్ధం అవుతుందో, వెంటనే అది మన చేత జీవింప బడుతుంది. దేనినైతే మనం అర్ధం చేసుకుంటామో, దేనినైతే మనం అవగాహన చేసుకుంటామో దానినే మనం జీవిస్తాం. ఏదైతే మన అవగాహనకు రాదో, మన వల్ల అర్ధం కాబడదో దానిని మనం జీవించలేం కదా? అర్ధం చేసుకుంటే, అవగాహన కలిగి వుంటే, మెదడుకు అది ఎక్కితే… మన జీవితంలో దాని ఆచరణ తనంతట తాను, సహజంగా వచ్చేస్తుంది… (ఈ కంటెంట్‌ను బ్రహ్మర్షి పత్రీజీగారి “ఆధ్యాత్మిక శాస్త్రం” ఆడియో నుండి సేకరించబడింది)
|