“పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్”

బెంగళూరు

“అద్భుతాలకే అద్భుతం … మైత్రేయ బుద్ధా ధ్యాన విశ్వాలయం”

“ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి” అంటూ బ్రహ్మర్షి పత్రీజీ నేతృత్వంలోని, సమస్థ మానవాళి ఆత్మోద్ధరణకై పాటుపడుతోంది. పిరమిడ్ అద్భుత శక్తిని సామాన్య మానవులకు కూడా విశేషంగా అందుబాటులోకి తీసుకురావడానికి మునుపు ఎన్నడూ లేనివిధంగా పిరమిడ్ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టింది. ఆ కోవలోకి చెందిందే పిరమిడ్ మాస్టర్లందరూ గర్వించదగిన బెంగళూరు “మైత్రేయ బుద్ధా ధ్యాన విశ్వాలయం”. 160′ x 160′ నిర్మాణపు కొలతలో .. ఒకేసారి ఐదువేల మంది ధ్యానులు కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా నిర్మితమైన ఈ మహాశక్తిక్షేత్రం . . అతి సామాన్యుడి నుంచి మొదలుకుని దేశ విదేశాలలోని జిజ్ఞాసువులనూ, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులనూ విశేషంగా అలరిస్తోంది.

ఈ క్రమంలో . . ప్రఖ్యాతిగాంచిన Times మ్యాగజైన్ సౌజన్యంతో “Bangalore Mirror” అన్న ప్రజాభిమానం చూరగొన్న వార్తాపత్రిక “బెంగళూరులో ఉన్న ఏడు అద్భుతాలు” . . Seven Wonders Bengaluru” అన్న సర్వేను దేశవ్యాప్తంగా చేపట్టింది. అద్భుతమైన విషయం ఏమిటంటే . . సమస్త పిరమిడ్ లోకం గర్వించేటట్లు అద్భుతాల్లోకెల్లా అద్భుతంగా .. ఈ సర్వేలో మన “పిరమిడ్ వ్యాలీ” లోని “మైత్రేయ బుద్ధా ధ్యాన పిరమిడ్” “నెంబర్ వన్” గా నిలిచింది.

మరిన్ని వివరాలకు సంప్రదించండి : www.pyramidvalley.org