‘ధ్యానం’ అంటే…

Patriji-in-Meditation‘ధ్యానం’ అంటే మనస్సును పరిశూన్యం చేయడం, మనస్సును “ఆలోచనారహితం” చేయడం. మనస్సుకు విశ్రాంతి నివ్వడమే ‘ధ్యానం’. సరియైన ధ్యాన విధానం అంటే సుఖమైన ధ్యానముద్రలో కూర్చుని, కళ్ళు రెండూ మూసుకుని మనస్సును పరిశూన్యం గావిస్తూ “శ్వాస మీద ధ్యాస” పెట్టడం. అంటే “మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం”. సరళమైన, స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం. ధ్యానస్థితిలో మనకు విశ్వశక్తి లభ్యమౌతుంది, మన మూడవకన్ను తెరుచుకుంటుంది. ధ్యానం పిరమిడ్‌లో కానీ పిరమిడ్ క్రింద కానీ చేస్తే “పిరమిడ్ ధ్యానం” అంటారు. ధ్యానం చేసే పద్ధతి…

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్

PSSM-Meditatorsపిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ బ్రహ్మర్షి పత్రీజీ గారు వ్యవస్థాపించారు. పాత మతాల నుంచి విడివడిపోయి క్రొత్త నవ్యయుగ ఆధ్యాత్మిక విభాగాన్ని, శాకాహార విశిష్టతను మరియు పిరమిడ్ శక్తి యొక్క అవగాహనను ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగజేయడం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క లక్ష్యం. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రపంచ వ్యాప్త నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవంలో భాగం. ఈ విప్లవం సమస్త మానవాళిని అహింస మరియు శాకాహారం వైపు నడిపిస్తూ అందరినీ మాస్టర్స్‌గా తయారు చేయడానికి ఆరంభించారు. మరిన్ని వివరాలు…

బ్రహ్మర్షి పత్రీజీ

Patriji-Laughing పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ గారు తీవ్ర ధ్యాన సాధన ద్వారా 1979లో ఎన్‌లైటెండ్ అయ్యారు. అప్పటి నుండి తన జీవిత గమ్యంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం మరియు శాకాహార విశిష్టత గురించి ఆధ్యాత్మిక సత్యాలను బోధించాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మికతను కుల మతాలకు అతీతంగా శాస్త్రీయ పద్ధతిలో అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా చెప్పడం పత్రీజీ గారి ప్రత్యేకత. మరిన్ని వివరాలు…

ధ్యాన వేణువు

శాకాహార జగత్

Vegetarian-Tree భారతదేశం అహింసా దేశం. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి శాకాహార దేశం అయితీరాలి. జంతు సామ్రాజ్యానికి ఇక పూర్ణ స్వాతంత్ర్యం ఇద్దాం… జంతు సామ్రాజ్యాన్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే నిజమైన మానవతా ధర్మం. అన్య ప్రాణి పట్ల ఉపకారమే ‘స్వ’ ఉపకారం, అన్య ప్రాణి పట్ల అపకారమే ‘స్వ’ అపకారం. జంతువధ అన్నదే మానవాళి యొక్క మహాపాపకర్మ. జంతుమాంసభక్షణ అన్నదే సకల రోగాలకు మూలకారణం… మరిన్ని వివరాలు…

పిరమిడ్ శక్తి

mmp

పిరమిడ్లలో మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు కట్టాలి. “వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం” అన్నది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలకు ముఖ్యమైన పాయింట్ అన్నమాట. మరిన్ని వివరాలు…

పత్రీజీ కాన్సెప్ట్స్

“శని దేవుడు”

“శని దేవుడు”   మనం అంతా దివ్యలోకాల నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళం! దివ్యలోకాలలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులం భువిలో ఉన్నప్పుడు భూలోకవాసులం ఇలా దివి నుంచి భువికి దిగివ చ్చిన దేవుళ్ళందరూ సృష్టికి విషిష్ఠ అల్లుళ్ళు! అందుకే ప్రకృతి మాత అల్లుళ్ళందరికీ... read more