పత్రీజీ సందేశాలు

పత్రీజీ సందేశాలు

Patriji-Speaking

ధ్యానం అంటే ” శ్వాస మీద ధ్యాస “


ధ్యానమే సర్వస్వం
ధ్యానమే యోగం
ధ్యానమే భక్తి
ధ్యానమే ప్రపత్తి
ధ్యానమే ఆరోగ్యం
ధ్యానమే మోక్షం
ధ్యానమే ధర్మం
ధ్యానమే అర్ధం
ధ్యానమే భోగం
ధ్యానమే సర్వం
ధ్యానమే సత్యం
ధ్యానమే శివం
ధ్యానమే సుందరం


ధ్యానం ద్వారా ప్రకృతిలోని శక్తిని గ్రహించాలి


కళ్ళు రెండూ మూసుకుని శ్వాసతో కలిస్తే ధ్యానం.
కళ్ళు రెండూ తెరుచుకుని ప్రకృతితో కలిస్తే జీవనం.


మన మనస్సు ‘జీరో’ అయితే మనం ‘హీరో’లు అవుతాం.
మన మనస్సు ‘హీరో’ అయితే మనం ‘జీరో’ అవుతాం.


సన్మతిని సాధించిన వాళ్ళే “బుద్ధుళ్ళు”


‘నాది’, ‘నేను’ అంటే .. “జీవుడు”
‘నాది’, ‘నేను’ వదిలితే .. “దేవుడు”
ఇదే “బుద్ధత్వం”


ఈ భూమి పై జీవిస్తున్న ప్రతి జీవికూడా దైవత్వంతో నిండి ఉంది.
ఆ సత్యాన్ని ధ్యాన సాధన ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి.


ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ‘నేను శరీరం కాదు, శాశ్వతమైన, దివ్యమైన ఆత్మచైతన్యాన్ని’ అన్న సత్యం తెలుసుకుని ఎరుకతో జీవించాలి