“పిరమిడ్ శక్తి”

పిరమిడ్లలో మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు కట్టాలి.

 

“వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం” అన్నది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలకు ముఖ్యమైన పాయింట్ అన్నమాట.

‘గ్రేట్ పిరమిడ్’ అనేది ఈజిప్ట్‌లో ధ్యానం కోసమే కట్టబడింది. ఇతరలోక వాసులు ధ్యానం కోసమే వాటిని కట్టించారు. కర్నూలు “బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం” అన్నది మొట్టమొదటి భారతదేశపు “పిరమిడ్ ధ్యాన కేంద్రం”. ఇప్పుడు ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి. మరి పిరమిడ్లను క్యాప్‌ లా చేసుకుని, మనం అవి తలపై పెట్టుకుని ధ్యానం చేయవచ్చు. రూఫ్‌టాప్‌లో మనం పిరమిడ్ కట్టుకోవచ్చు.

పెద్ద పెద్ద ధ్యాన కేంద్రాలన్నీ పిరమిడ్ ఆకారాల్లోనే రావాలి. పిరమిడ్ శక్తి గురించి ఎన్నో చక్కటి పుస్తకాలొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ’పిరమిడ్ యుగం’ … మరి ఇది ‘ధ్యాన యుగం’ ఇది ‘ఆనాపానసతి’ యుగం. మరి ఇది “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్ల యుగం”; కనుక విధిగా పిరిమిడ్లే కట్టాలి.

ఇంక రాబోయే కాలాల్లో మందిరాలు ఉండవు, దేవాలయాలు ఉండవు, మసీదులు ఉండవు, చర్చీలు ఉండవు … పిరమిడ్లే ఉంటాయి. ఇది తెలుసుకోండి. ఎంత తొందరగా ‘పిరమిడ్ కల్చర్’ లో ప్రవేశిస్తే అంత తొందరగా మనం అసలైన సిసలైన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులమవుతాం.