“పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్”

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ను బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు వ్యవస్థాపించారు. పాత మతాలనుండి విడువడి ఒక క్రొత్త నవ్య ఆధ్యాత్మిక విభాగాన్ని, శాకాహార విశిష్టతను మరియు పిరమిడ్ శక్తి యొక్క అవగాహనను ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగజేయడమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క లక్ష్యం. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రపంచ వ్యాప్త నవ్య యుగ ఆధ్యాత్మిక విప్లవంలోని భాగం. ఈ విప్లవం సమస్త మానవాళిని అహింస మరియు శాకాహారం వైపు నడిపిస్తూ అందరినీ మాస్టర్స్‌గా తయారు చేయడానికే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆరంభించబడింది.

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క కార్యకలాపాలు మరియు సాధించిన విజయాలు

  • అందరికీ ఆనాపానసతి ధ్యానం గురించి అవగాహన కలిగించటం.
  • వందలాది ఉచిత ధ్యానం తరగతులు మరియు కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా నిర్వహింపబడ్డాయి. పిరమిడ్ మాస్టర్‌లు ధ్యానం నేర్పడానికి ఎలాంటి రుసుములనూ వసూలు చెయ్యరు.
  • 30,000 కంటే ఎక్కువ గ్రామాలు, పట్టణాలు మరియు నగరాలలో ఈరోజు వరకు ధ్యాన ప్రచారాన్ని అనంతంగా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కొనసాగిస్తోంది.
  • పెద్ద ఎత్తున ధ్యాన శిబిరాలను భారతదేశం అంతటా వందలాది నగరాలలో మరియు 75 పైగా ప్రముఖ పట్టణాలలో నిర్వహించింది.
  • పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరు వద్ద వరుసగా నాలుగు సార్లు Global Congress of Spiritual Scientists  కార్యక్రమాన్ని నిర్వహించింది. GCSS అనేది అనేక మంది ప్రపంచ ఆధ్యాత్మిక జిజ్ఞాసులు మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పాల్గొనే వార్షిక సమ్మేళనా కార్యక్రమం.
  • భారతదేశంలో అనేక పట్టణాల్లో IFSS యొక్క బ్యానర్ పై అనేక స్పిరిచ్యువల్ సైన్స్ వర్క్ షాపులను నిర్వహించింది.
  • వార్షిక కార్యక్రమాలైన ధ్యాన మహాయజ్ఞం మరియు ధ్యాన మహాచక్రాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో లక్షలాది మంది ధ్యానం గురించి మరియు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకుని, సామూహిక ధ్యానంలో పాల్గొన్నారు.
  • బుద్ధ పూర్ణిమ వార్షిక వేడుకలను పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరులో నిర్వహించారు. ప్రతిరోజు వేలాది మంది మెడిటేటర్స్ మరియు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్పిరిచ్యువల్ లిట్రేచర్

  • కరపత్రాలు, బ్రోచర్‌లు మరియు పోస్టర్ల రూపంలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టత మరియు నవ్య యుగ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి లక్షలకు పైగా కాపీలు ముద్రించి ప్రచారం చేశారు.
  • వందలాది ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆడియో మరియు వీడియో CD లు పత్రీజీ ద్వారా మరియు ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా ప్రచురితమైనవి.
  • ప్రపంచ ఆధ్యాత్మిక పుస్తకాలను యాభైకు పైగా భారతీయ భాషలలోకి అనువదించినవి ప్రచురించింది.
  • ఆంగ్లంలో, హిందీలో మరియు ఏడు ఇతర భారతీయ భాషలలో అనేక, నెలసరి, ద్వి-నెలసరి మరియు త్రై-మాసిక ఆధ్యాత్మిక పత్రికలను ముద్రించి ప్రచురించింది.

పిరమిడ్ ధ్యాన కేంద్రలను స్థాపించటం

  • పది వేలకు పైగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలను భారతదేశం మరియు ఇతర ప్రపంచ దేశాలలో స్థాపించారు.
  • భారతదేశం అంతటా యాభైకు పైగా పెద్ద పెద్ద పిరమిడ్లను మరియు ఐదు వేలకు పైగా రూఫ్ టాప్ పిరమిడ్లు నిర్మించారు.
  • బెంగళూరు సమీపంలో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మెడిటేషన్ అండ్ స్పిరిచ్యువల్ సైన్స్ టీచింగ్ సెంటర్‌ను నిర్మించారు.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ నెలకొల్పిన ఇతర సంస్థలు

  • భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అంతటా పాఠశాల స్థాయి పిల్లలకు మరియు కళాశాల స్థాయి యువతకు ధ్యానం నేర్పేందుకు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్‌ను స్థాపించిరి.
  • అన్ని రుగ్మతలను నయం చేసుకోవడానికి యాభై కి పైగా వైద్యులు, ధ్యానం మరియు ఆత్మ జ్ఞానాన్ని బోధించడానకై పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్‌ మరియు పిరమిడ్ ఆధ్యాత్మిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను (Pyramid Spiritual Health Care Centres) స్థాపించిరి.
  • ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితాలను మరియు ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని అన్ని పాఠశాలలో మరియు కళాశాలల్లో బోధించబడి, ఒక సిలబస్ రూపొందించడానికి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్స్‌ ను స్థాపించిరి.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఉద్భవం

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ మొట్టమొదట బ్రహ్మర్షి పత్రీజీ గారి చేత “ది కుర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ” అని 1990 లో ఆంధ్రప్రదేశ్ నందు కర్నూల్ పట్టణంలో ఆవిర్భవించింది.

మొట్టమొదటి పిరమిడ్ … 30ftx30ft  పరిమాణంలో శ్రీ బి.వి.రెడ్డి గారి సహాయ సహకారాలతో కర్నూల్ పట్టణంలో 1991 వ సంవత్సరంలో నిర్మించారు. దీనికి “బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం” గా పేరు పెట్టారు.

ఆ తరువాత మూడు, నాలుగు సంవత్సరములలో, ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ మరియు ఇతర రాష్ట్రాలలో వ్యాప్తి చెందుతూ అనేక గ్రామాలు, పట్టణాలలోకి విస్తృతంగా విస్తరిస్తోంది.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క ఇతర ప్రాజెక్ట్‌ల వివరాలు…