వికసిత పుష్పాలుగా ఉండాలి

 

ఒక వృక్షం యొక్క క్రమంలో ముఖ్యంగా రెండు దశలు వుంటాయి.

ఒక్కదాన్ని వెజిటేటివ్ దశ అంటాం. రెండవ దాన్నిఫ్లావరింగ్ దశ అంటాం వెజిటేటివ్ దశ అంటే విత్తన స్థితి నుంచి వృక్షం తన పుష్ప దశ వరకు సంతరించుకునే స్థితి అన్నమాట. ఫ్లావరింగ్ దశ అంటే ఆ ఎదిగిన వృక్షం తన పుష్ప దశ వరకూ తన ఎదుగుదల అయిపోయింది గనుక ఇక ప్రతి సృష్టికి, తన వంతు అయిన ప్రత్యేక సృష్టికి ఇంక పూనుకోవడం అన్నమాట.

ఇదే విధంగా ఒక అపరిపూర్ణుడైన మానవుడు పరిపూర్ణుడుగా అయ్యేంత వరకూ ఉండే స్థితే ఆ మానువుడి జన్మ పరంపరలు వెజిటేటివ్ దశ.

తాను పరిపూర్ణుడైన తర్వాత ఇక ప్రతిసృష్టి కి పూనుకుంటూ, ఇతరులనూ పరిపూర్ణులుగా తయారు చేసేందుకు కృషి చేసేవారే… తమ జీవితంలో రెండవ దశను అంటే ఫ్లావరింగ్ దశ ను అందుకునే వారు.

ప్రతి మనిషీ, వికసిత పుష్పం గా మారాలి..

అందరూ తాము సంపూర్ణతను సంపాదించుకోవటమే కాకుండా వీలైనంత మందినీ పరిపూర్ణులుగా చేయ నిమగ్నులవ్వాలి.

స్వంత ధ్యాన సాధాన ద్వారా స్వంత పరిపూర్ణత్వాన్ని సాధించుకుని.. వికసిత పుష్పాలు గా మారాలి

ఆ తర్వాత నిరంతర ధ్యాన ప్రచారం- ద్వారా ధ్యాన ఫలాలుగా మారాలి.