“వసిష్ట గీతలో ‘అదృష్టం’”

 

“యధా సంయతతే యేన తధా తేనానుభూయతే

స్వకర్మైవేతి చాస్తే న్యా వృత్తిరిక్తా న్ దైనదృక్”

– వసిష్ట గీత (2-17)

“ఎవడు ఎలా ప్రయత్నిస్తాడో,

దాని ఫలాన్ని అతడు అలాగే అనుభవిస్తాడు;

పూర్వజన్మలలోని స్వీయ కర్మలే ఫలావస్థ పొందినప్పుడు

‘దైవం’ అనీ, ‘అదృష్టం’ అనీ చెప్పబడుతుంది;

ఆ విధంగా తన కర్మల కంటే వేరైన

‘దైవం’ కానీ, ‘అదృష్టం’ కానీ ఏమీ లేదు”

అలాగే ఇంకొక శ్లోకం

“దోష శామ్యత్వ సందేహం ప్రాక్తనోద్యతనైర్గుణై

దుష్టాన్తోత్ర హస్తనస్య దోషస్యాద్య గుణై క్షయ”

– వసిష్ట గీత (2-17)

“ఈ జన్మలోని ‘శుభ ప్రయత్నం’ ద్వారా పూర్వ జన్మపు అశుభ పురుష ప్రయత్నాలు అన్నీ నిస్సందేహంగా శమించి పోతాయి; ‘గత దినంలోని అజీర్ణాది దోషాలు ఈవాల్టి ఔషధాది గుణాల ద్వారా నయమవటమే’ ఇక్కడి దృష్టాంతం”