“వాక్కు మీద ధ్యాస”

 

రెండు రకాలైన వాక్కులున్నాయి.

రెండు రకాలైన వాక్కులేవంటే –

(1) అజాగ్రత్తగా మాట్లాడటం; (2) జాగ్రత్తగా మాట్లాడటం.

అలాగే రెండు రకాలైన మనస్సులున్నాయి

రెండు రకాలైన మనస్సులేవంటే

(1) కాన్షియస్ మైండ్; (2) సబ్‌కాన్షియస్ మైండ్.

జాగ్రత్తగా మాట్లాడటం అనేది కాన్షియస్ మైండ్ కు ప్రతిబింబం;

అది కాన్షియస్ మైండ్ కు మరింత బలాన్ని చేకూర్చుతూ వుంటుంది.

అంతే కాకుండా జాగ్రత్తగా మాట్లాడటం అన్నది

సబ్‌కాన్షియస్ మైండ్ ను రిపేర్ చేస్తూ కూడా వుంటుంది.

మన ఆత్మ పరిధిలో 9/10 వంతు సబ్‌కాన్షియస్ మైండ్ అయివుంది;

కాన్షియస్ మైండ్ మటుకు 1/10 వంతు మాత్రమే వుంటుంది.

ఎప్పుడైతే, సబ్‌కాన్షియస్ మైండ్‌లో వున్న 9/10 మనస్సు జాగ్రత్తగా అతి జగ్రత్తగా మాట్లాడటం అన్న వాక్ సాధన వలన పూర్ణంగా శుద్ధి అవుతుందో – అప్పుడు మనం దేవుడి రాజ్యంలో చేరినట్లే. అప్పుడు మనం దేవుని కుమారులం అయినట్లే.

ఆ దేవుడి కుమారుడు – ఆ పరమాత్ముడు – జీసస్ అనలేదా ఏదైతే నోట్లోకి వెళ్తుందో అది మానవుణ్ణి కలుషితం చెయ్యదు. కానీ, ఏదైతే నోట్లోంచి బయటకు వస్తుందో అదే మానవుణ్ణి కలుషితం చేస్తుంది. అని ..

కనుక, మనం

ఇక నుంచి ఎప్పుడూ అజాగ్రత్తగా మాట్లాడరాదు.

ఇక నుంచి మాట మాటకూ జాగ్రత్త వహిద్దాం.

… తస్మాత్ జాగ్రత్త,

… వాక్కు పట్ల జాగ్రత్త.