ఉపవాసం+జాగరణ

 

“శివరాత్రి”లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.
ఒకటి: “ఉపవాసం”
రెండు: “జాగరణ”
“ఉపవాసం” అంటే .. “మానసిక పరమైన లంఖణం”
“ఉపవాసం” అంటే .. “ధ్యానంలో మనస్సును శూన్యపరచుకోవడం”
“ఉపవాసం” అంటే కడుపుకు ఏమీ పెట్టకపోవడం కాదు
“జాగరణ” అంటే .. “దివ్యచక్షువు యొక్క జాగరణ”
“జాగరణ” అంటే .. “ఆత్మ యొక్క జాగరణ”
“జాగరణ” అంటే .. రాత్రంతా మేల్కొని “శివుడి సినిమాలు” చూడడం కాదు
ప్రొద్దుటినుంచీ “ఉపవాసం” ఉంటేనే .. రాత్రి “జాగరణ” అయ్యేది
ప్రొద్దుటి నుంచీ ధ్యానాభ్యాసంలో అంటే .. శ్వాసానుసంధానంలో ఉంటేనే
రాత్రికి దివ్యచక్షువు యొక్క ఉద్దీపనం అయ్యేది
“ఉపవాసం” లేకుండా “జాగరణ” అన్నది అసంభవం
“ఉపవాసం” యొక్క ధ్యేయమే .. “జాగరణ”
“జాగరణ”కు కావలసింది ముందుగా “ఉపవాసం”
ఇదీ అసలు కథ.
కడుపులో ఏమీ పెట్టకపోవడం వల్ల మనోనాశనం కాజాలదు
రాత్రి అంతా శివుడి యొక్క సినిమాలు చూడ్డం ఆత్మోద్దీపనం కాజాలదు
ఒక్క పగలైనా నిజమైన “ఉపవాసం”లో ఉండి
ఒక్క రాత్రంతా అయినా “నిజమైన జాగరణ”లో ఉంటే
ఆ ఒక్క రోజు చాలు..
ఆ రోజు “మహాశివరాత్రి” అవుతుంది
.. “జన్మకో శివరాత్రి” అంటారు..
ఒక్క రాత్రి “నిజమైన శివరాత్రి” అయితే .. ఇక జన్మంతా “నిజమైన జాగరణే”
ఒక్క పగలు “నిజమైన ఉపవాసం”లో ఉండగలిగితే ఇక జన్మంతా “నిజమైన ఉపవాసమే”
ఏసు ప్రభువు .. “I fasted for forty days” అన్నారు.
అది శారీరక ఉపవాసం కాదు .. మానసిక ఉపవాసం
“I and my Father are one”
“In my Father’s Kingdom there are many mansions”
“Seek ye the Kingdom of God . . and his Righteousness first
and then all else will be added unto you”
అన్నప్పుడు .. అదంతా నిజమైన జాగరణే
.. అదే విధంగా ..
“ఓ అర్జునా, నువ్వూ నేనూ ఎన్నో జన్మలు ఎత్తాం
అవన్నీ నాకు తెలుసు ..”
“ఓ కుంతీపుత్రుడా, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే
అయితే, నేనున్న స్థితికి నీ స్థితి కూడా చేరుకుంటే ఇక నువ్వు మళ్ళీ తిరిగిరావు ..”
అని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో అన్నప్పుడూ .. అదంతా నిజమైన జాగరణే
“ఉపవాసం” అన్నది ధ్యాన కర్మ అయితే
“జాగరణ” అన్నది.. ధ్యాన మహాకర్మ యొక్క మహాఫలం
“ఉపవాసం జిందాబాద్” .. అంటే .. “ధ్యానం జిందాబాద్”
“జాగరణ జిందాబాద్” .. అంటే .. “ఆత్మానుభవాలు జిందాబాద్”
“జాగరణ జిందాబాద్” .. అంటే .. “శివుడు-మూడవకన్ను జిందాబాద్”