“స్వామీ దయానంద సరస్వతి”

 

ఆర్యసమాజ స్థాపకుడు శ్రీ స్వామి దయానంద.

నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యుడు స్వామీ దయానంద.

వేదాలను అంత చక్కగా అధ్యయనం చేసినవారు భారతదేశంలో మరొకరు లేరు అని ఈయన గురించి అన్నరు స్వయంగా అరవిందుల్ వారే. థియోసాపికల్ సొసైటీ ఫౌండర్ అయిన మేడమ్ బ్లావెట్క్సీగారు ఇండియా వచ్చినప్పుడు ఆవిడను ఆకట్టుకున్న ఏకైక ఆధ్యాత్మికవేత్త స్వామీ దయానంద సరస్వతి.

పాడు సంఘం, ఆయన్ను చంపివేసింది. విషాన్ని త్రాగించింది, కానీ సత్యం ఎప్పుడూ చావదు – సత్యమేవ జయతే కదా, మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త అని దిక్కులు పిక్కటిల్లే నినాదాన్ని ప్రపంచానికి ప్రసాదించారు స్వామీ దయానంద. ఈ విషయంలో స్వామీ దయానంద పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల మాస్టర్లందరికీ మహా ఆదర్శప్రాయుడు.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారు అందరి మాస్టర్స్ దగ్గర నుంచీ, అందరి మంచి గ్రహించటంలో, అదే సమయంలో ఆయా మాస్టర్లలోని స్వల్ప వికారాలను తిరస్కరించటంలో ఆరితేరిన హస్తాలు. స్వామీ దయానందుల వారి సత్యార్థప్రకాశంలో ఎన్నో త్యాజ్యనీయమైనవనా, ఎన్నో గ్రాహ్యమైనవి కూడా.

భారతదేశంలో దేవాలయాలు వుండి తీరాలి. విగ్రహాలు వుండి తీరాలి. కానీ విగ్రహారాధనలు ఉండరాదు. అది పూర్ణ పిచ్చి. ఎవరెస్టుకు సరిసమానమైన మూర్ఖత.

ఆస్తిక ప్రపంచ ప్రధాన సిద్ధాంత మేమంటే – మనం ఆత్మ స్వరూపులం.

కానీ ఆస్తికత అన్నదానికి విపరీతంగా చరిస్తున్నారు నేటి మూర్ఖ ఆస్తికులు. నేటి ఆస్తికత మూర్తిపూజ, వృక్షపూజ, జంతుపూజ, ప్రత్యేక మనుష్యుల పూజ – రీతుల్లో అందరికీ వెగటు పుట్టిస్తోంది.

విగ్రహారాధన అనేది భక్తి యోగ సూత్రంగా విపరీత పరిణామం చెందిన వింత రోజులు ఇంక ముగిసిపోయాయి.

వాస్తవానికి, భక్తి అనే దానికి ఆధ్యాత్మికతలో ఎలాంటి స్థానమూ లేదు.

ఉన్నదంతా ఒకే పదార్థం. వున్నదంతా ఒకే ఏకత్వం.

రెండుగా సృషిలో లేవు; వున్నది ఒక్కటే.

సర్వం ఖల్విదం బ్రహ్మ, – అహం బ్రహ్మాస్మి.

తనను తాను పూజించుకోవడమేమిటి?

జ్ఞానాన్ ముక్తిః అన్నాడు కదా కపిలుడు.

కావలసినవి ధ్యానం – ఆత్మజ్ఞానం. అంతేకానీ ఎవరి మీదా, ఎవరి పట్లా భక్తి కాదు.

కనుకనే, స్వామీ దయానంద సరస్వతి గారు మూర్తి పూజ మెట్టుకాదు, అగడ్త అని ఆత్మజ్ఞుడిగా వక్కాణించారు.

ఈ మౌలిక సందేశాన్ని భారతదేశం యావత్తుకూ అందించడానికై తన జీవితాన్నే పణంగా పెట్టిన మహాత్యాగి, దయానందజీకి శతసహస్ర థ్యాంక్స్.

మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త.

మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త.

మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త.