ఆత్మజ్ఞాన ప్రజ్ఞ

 

 

1. భౌతిక చక్షువు 2. మనోచక్షువు 3.దివ్యచక్షువు 4. ప్రజ్ఞాచక్షువు

“‘బౌతిక చక్షువు’ అన్నది పంచేంద్రియ పరిమిత జ్ఞానంతో కేవలం భౌతిక ప్రపంచపు విషయాలను మాత్రమే చూడగలిగితే .. “మనో చక్షువు” అన్నది అలా చూసిన విషయాలను గతంలో చూసి మనస్సులో నిక్షిప్తం చేసుకున్న ముద్రలతో పోల్చి .. ద్వంద్వంతో కూడి విశ్లేషించుకుంటూ ఉంటుంది.

 “‘ఆధ్యాత్మిక చక్షువు’ లేదా ‘దివ్యచక్షువు’ లేదా “మూడవకన్ను” అన్నది మామూలు కంటికి ఎంతమాత్రం కనిపించని అనేకానేక సూక్ష్మ లోకాలనూ మరి సూక్ష్మ శరీరధారులనూ చూడగలుగుతుంది.

“భౌతిక చక్షువునూ, మనో చక్షువునూ ధ్యానసాధన ద్వారా ఒకింత మూసుకుని శూన్యస్థితిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చక్షువు తెరుచుకుంటుంది.

“ఇలా ఆధ్యాత్మిక చక్షువును తెరిపించుకున్నవారికే, పరంపరగా, ప్రజ్ఞాచక్షువు తెరుచుకుంటుంది.

“భౌతిక చక్షువు మూసుకున్నప్పుడు మాత్రమే ఎక్కడో దూర ప్రదేశంలో ఉన్న మన అమ్మను మనోచక్షువుతో చూడగలిగినట్లు .. మనోచక్షువును కూడా శూన్యం చేసినప్పుడే .. ఆధ్యాత్మిక చక్షువుతో సూక్ష్మలోకాలలో ఉన్న దివ్యాత్ములను చూడగలుగుతాము. వారి నుంచి జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటేనే మన ప్రజ్ఞా చక్షువు తెరుచుకోబడి మనకు ఆత్మ సత్యం/సృష్టి రచనా సత్యం అవగతం అవుతుంది.

“ఆత్మజ్ఞాన ప్రజ్ఞతో మాత్రమే మనం మన ప్రాపంచిక జీవితాన్ని రెండింటినీ హాయిగా ఆనందంగా గడుపగలుగుతాం” అని తెలియ జేశారు.