సిద్ధ పురుషులు

 

“సిద్ధ పురుషులు ఏ నియమాన్నీ పాటించాలని అనుకోరు. ప్రాపంచిక వ్యక్తులు నియమ నిబంధనలను పాటిస్తారు. సిద్ధ పురుషులు తమ హృదయాలను అనుసరిస్తారు. ప్రాపంచిక వ్యక్తులు సామాజిక నియమాలను అనుసరిస్తారు.

“సిద్ధపురుషులు తమ పిచ్చితనంలో ఆనందంగా ఉంటారు. ప్రాపంచిక వ్యక్తులు పిచ్చిలేకపోయినా ఆనందంగా ఉండరు.”

సిద్ధపురుషులు వస్త్రాలు ధరించకపోయినా ఆనందంగా ఉంటారు. ప్రాపంచిక వ్యక్తులు సంపదలు, సౌఖ్యాలు అన్నీ ఉన్నా ఆనందంగా ఉండరు.

“సిద్ధపురుషులు తాము చెయ్యాలనుకున్నదే చేస్తారు. ప్రాపంచిక వ్యక్తులు తాము చెయ్యాలి అనుకున్నది కూడా చెయ్యరు.”

“సిద్ధపురుషులు సామాజిక నియమాలను అనుసరించరు. ప్రాపంచిక వ్యక్తులు సామాజిక నియమాలనే పట్టుకుని వ్రేళ్ళాడతారు.”

“మీరు నిజంగా ఏదైనా అనుసరించాలని భావిస్తే PSSM ని అనుసరించండి. పిరమిడ్ మాస్టర్‌గా ఉండండి. అక్కడ ఆధ్యాత్మికతతో పాటు ప్రాపంచికత కూడా మిళితమై ఉంటుంది. దానిలో మీరు ప్రాపంచిక వ్యక్తిగా మరి ఆధ్యాత్మిక వ్యక్తిగా. అక్కడ మీరు ఒక చట్రంలో ఇమిడి ఉంటారు. మరి చట్రంలో లేకుండానూ ఉంటారు. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఉంటారు.”

“కొన్నిసార్లు ప్రాపంచికంగానూ .. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగానూ .. కొన్నిసార్లు రెండింటిగానూ ఉంటారు. కొన్నిసార్లు వాటిలో ఏదీ లేకున్నా కూడా ఉండగలుగుతారు. కేవలం ప్రాపంచికులు సిద్ధపురుషులు అయిన మిమ్మల్ని అర్థం చేసుకోరు. పిరమిడ్ మాస్టర్ సిద్ధపురుషుడు కాదు. మరి కేవలం ప్రాపంచిక వ్యక్తి కాదు. పిరమిడ్ మాస్టర్ ఆ రెండింటి కలబోత. “

“కొన్నిసార్లు పిరమిడ్ మాస్టర్లు ప్రాపంచిక వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. మరికొన్ని సార్లు సిద్ధ పురుషులుగా ప్రవర్తిస్తారు. మనం కేవలం సిద్ధత్వం వలన లేదా ప్రాపంచికత వలన ఆనందంగా ఉండం. మనం పిరమిడ్ మాస్టర్లమైనందువలనే ఆనందంగా ఉంటాం.”

“పిరమిడ్ మాస్టర్ ప్రాపంచికతలో మునగని ప్రాపంచిక వ్యక్తి, సిద్ధత్వంలో జీవించని సిద్ధపురుషుడు ఈనాటి ప్రాపంచిక వ్యక్తి రేపటి సిద్ధపురుషుడుగా మారతాడు. ఈనాటి సిద్ధపురుషుడు రేపటి పిరమిడ్ మాస్టర్‌గా మారతాడు. ఒకసారి పిరమిడ్ మాస్టర్‌గా మారిన తరువాత ఎప్పటికీ పిరమిడ్ మాస్టర్‌గానే ఉంటాడు!”

“మనం ఏకకాలంలో భోగులం మరి యోగులం. పిరమిడ్ మాస్టర్ మాత్రమే యోగత్వం భోగత్వం కలబోసిన మనోహరమైన మేళవింపు .. భ్యోగి.”

“అయితే ఇక్కడ నిలిచి ఉండటం ఎంతో కష్ట సాధ్యం. ఇక్కడ నుంచి అందరూ పారిపోతారు. కొంతమంది మన సంస్థను వదిలి వెళ్ళారు. వారు ఇక్కడ నిలవలేరు.”

మీరు మీ చివరి క్షణం వరకు .. చివరి శ్వాస వరకు .. నిలిచి ఉంటే మీరొక పరిపూర్ణ మాస్టర్. మీరు పరిపూర్ణ మాస్టర్ అయినప్పుడు సహసృష్టికర్తగా మారి మీ స్వీయగ్రహాలనూ, సూర్యుణ్ణీ సృష్టిస్తారు. పరిపూర్ణ మాస్టర్లు ఎన్నో గ్రహాలను, నక్షత్రాలను, భూమి, సూర్యుడు వంటి వాటిని సృష్టించారు. వాటిని యుగాల తరబడి సంరక్షిస్తూ ఉంటారు. “

“మీరు మీ చిన్నపిల్లలను సంరక్షించినట్లుగా వారు గ్రహాలు, చంద్రుడు, సూర్యుడిని అనంతంగా సంరక్షిస్తూ ఉంటారు. అది నిరంతరం కొనసాగుతూంటుంది. పిల్లలకు జన్మ నివ్వడంతోనే మన పని అయిపోదు .. అప్పుడే మన పని మొదలవుతుంది.”

“మీరు గత జన్మలలో సిద్ధపురుషులు అయి ఉండకపోతే ఈ జన్మలో పిరమిడ్ మాస్టర్లు అవ్వడం సంభవించదు. మీరు ఇక్కడకు ప్రాపంచికతనూ, ఆధ్యాత్మికతనూ, భోగాన్నీ, యోగాన్నీ మిళితం చేయడానికే వచ్చారు.”

“ప్రాపంచిక వ్యక్తి .. సిద్ధపురుషులు .. పిరమిడ్ మాస్టర్లు .. పరిపూర్ణ మాస్టర్ .. సహ సృష్టికర్త.”