శివుడు – త్రినేత్రుడు

 

“దివ్యచక్షువుకు పూర్వం ‘జీవుడు’ .. దివ్యచక్షువు ఉత్తేజితం తర్వాత ‘శివుడు’”

“శివ” అనే పదానికి “ఆనందం” అని అర్థం
“మంగళకరం” అనే మరో అర్థం కూడా ఉంది
కనుక
“శివుడు” అంటే “ఆనందమయుడు” అని అర్థం
“శివుడు” అంటే “మంగళకర జీవితం జీవిస్తున్నవాడు” అని అర్థం
అయితే, ఈ “శివ పదవి” ఎలా సాధ్యం?
శివుడికి “మూడవ కన్ను” ఉంటుందట
ఎవరెవరయితే తమ తమ “మూడవకన్ను” ను
అంటే, ” ఆత్మచక్షువు “ను అంటే, “అతీంద్రియ శక్తులను”
ఉత్తేజపరచుకుంటారో
వారందరూ “శివుళ్ళే” అవుతారు
దివ్యచక్షువుకు పూర్వం “జీవుడు” .. దివ్యచక్షు ఉత్తేజితం తర్వాత “శివుడు”
“మూడవకన్ను” ఉన్న ప్రతి మనిషీ “శివుడు” అనబడతాడు
“మూడవ కన్ను” తెరిస్తే మరి అంతా భస్మమవుతుందట .. నిజమే !
ఎప్పుడైతే మన “దివ్యచక్షువు” సంపూర్ణంగా విచ్చుకుంటుందో
అప్పుడే మన ప్రాపంచికపరమైన అజ్ఞానం భస్మమవుతుంది
అప్పుడే, మన వికృతీ వికారాలు అన్నీ శాశ్వతంగా అంతమవుతాయి

ధ్యాన సాధన ద్వారానే “మూడవ కన్ను” ఉత్తేజితమవుతుంది
ధ్యాన సాధన ద్వారానే “శివ పదవి” లభ్యమవుతుంది
“మూడవ కన్ను” ఉత్తేజితమయితే “మాయ” అన్నది భస్మమవుతుంది
“మాయ” అన్నది శాశ్వతంగా “మాయం  అవుతుంది.