పిరమిడాలజీ

 

“‘ఈజిప్ట్ దేశంలోని సహారా ఎడారిలో గ్రేట్ గిజా పిరమిడ్‌లు భూగ్రహాన్ని ప్రళయాలనుంచి రక్షించడానికే భూమధ్య రేఖపై నిర్మించబడ్డాయి’ అని చరిత్ర చెబుతోంది. ‘పిరమిడ్‌లు ఎక్కడ ఉంటే అక్కడ అవి ఆ ప్రదేశంలో ఉన్న నకారాత్మక తరంగాలను రద్దు (nullify) చేస్తాయి’ అని పిరమిడ్‌ల యొక్క శాస్త్రీయతపై విస్తృత ప్రయోగాలు చేస్తోన్న ‘పిరమిడాలజీ’ విభాగం తెలియజేస్తోంది.” “ఇటీవలి కాలంలో అమెరికా, చైనా, జపాన్, ఇండోనేషియా దేశాలతోపాటు ఇతర అనేక దేశాలలో రకరకాల పిరమిడ్‌లు, పిరమిడ్ సిటీలు కట్టబడుతున్నాయి. బోస్నియాదేశంలో ‘డా|| సెమిర్ శాంగ్ ఓస్మనాగిచ్’ అనే పురావస్తు శాస్త్రవేత్త పిరమిడ్‌లపై విశేష పరిశోధనలు చేస్తున్నారు.” “ఖమ్మం పట్టణంలో ‘స్రవంతి’ అనే ఒక అమ్మాయి రెండు సంవత్సరాలపాటు నడుమునొప్పితో బాధపడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది. అయినా లాభం లేకపోగా .. మంచానికే అంకితమై భోజనం కంటే ఎక్కువ మందులను తింటూ బాధపడింది. అదృష్టవశాత్తు పిరమిడ్‌లో ధ్యానంచేసి నెలరోజులలో హాయిగా లేచి తిరిగింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఖమ్మం దగ్గర పిరమిడ్‌లను తయారుచేసే పరిశ్రమను స్థాపించేశారు.” “మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూన్న ఒకానొక రహదారి ప్రక్కగా పిరమిడ్‌లను ఉంచినప్పుడు .. అక్కడ ప్రమాదాలు తగ్గుముఖం పట్టిందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు.” “పిరమిడ్ ఆకారంలో కట్టిన హాస్పిటల్స్‌లో రోగులు త్వరగా కోలుకుంటున్నారని వైద్య పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక చిన్న పాప పుట్టినప్పటి నుంచీ రాత్రింబగళ్ళు ఏడుస్తూనే ఉంది. పాలు త్రాగించుదామని ప్రయత్నించినా లాభం లేకపోవడంతో డాక్టర్లూ మరి పాప తల్లిదండ్రులూ తెగ ఖంగారు పడిపోయారు.” “అప్పుడు వాళ్ళకు పరిచయస్థులైన ఒక పిరమిడ్ మాస్టర్ ఆ పాపను చూడడానికి వస్తూ వెంట ఒక పిరమిడ్‌ను తెచ్చి పాపపై ఉంచారు. చిత్రంగా పాప శాంతించి పాలు కూడా త్రాగి నిద్రపోయింది. ఇవన్నీ కూడా సైన్స్ పరమైన సత్యాలు. “అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళపై చిన్నదో పెద్దదో ఒక పిరమిడ్‌ను నిర్మించుకుని ఇంటిని శక్తివంతంగా మార్చుకోవాలి.”