“పిరమిడ్ ధ్యానం ద్వారా .. ఉన్నత తలాల మాస్టర్లతో అనుసంధానం”

 

అనేకరకాల కట్టడాలూ సుందర భవనాలూ, కళ్ళు త్రిప్పుకోలేనంత అద్భుత నిర్మాణాలూ ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా వున్నాయి కానీ .. వాటన్నింటికంటే మించి పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత వుంది.

చాలా మంది “పిరమిడ్ నిర్మాణాలు అన్నవి కేవలం ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రమే” అనుకుంటారు; కానీ ” అవి భూగ్రహానికే కాకుండా సమస్త నక్షత్ర మండలాలకూ చెందిన అత్యద్భుతమైన శక్తిక్షేత్రాలు” అని వారికి తెలియదు.

కొందరు అల్పజ్ఞానులు “అవి కేవలం శవాలను భద్ర పరచే ప్రదేశాలు” అని అపోహలు పడుతూంటారు. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే .. ‘పిరమిడ్స్’ అన్నవి వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న ‘సిరయన్ నక్షత్ర లోకవాసుల’ ద్వారా కట్టబడిన శాస్త్రీయమైన కట్టడాలు. ఆ నాటి అవసరానికి అనుగుణంగా భూమిని శక్తిక్షేత్రంగా మలచడానికి ఈ పిరమిడ్‌లు నిర్మించబడ్డాయి.

“సిరియన్ నక్షత్రలోకవాసులు” ఆనాటి ఈజిప్ట్ నాగరికతకు చెందిన అట్లాంటియన్లకు తమ మేధోపరమైన సహకారాన్ని అందిస్తూ ఈజిప్ట్ దేశంలోని కైరో నగరంలో 450’x450′ అడుగుల నిర్మాణం కొలతలతో ప్రపంచంలో కెల్లా ఎత్తైన “గ్రేట్ గిజా పిరమిడ్” ను నిర్మించారు.

అతీంద్రయశక్తులైన లెవిటేషన్, టెలిపతీ, టెలీకినెసిన్ వంటి మరెన్నో విద్యల యొక్క సంయుక్త వినియోగంతో వారు ఆ బృహత్ నిర్మాణాలను పూర్తి చేశారు. ముఖ్యంగా పిరమిడ్ కోణం .. నిర్దిష్టమైన జామెట్రికల్ కొలతలతో కూడుకుని .. సరిగ్గా పిరమిడ్ జామెట్రికల్ కొలతలతో కూడుకుని .. సరిగ్గా పిరమిడ్ మధ్యభాగంలో ఉన్న “అగ్ని” తో అనుసంధానం అయివుంటుంది.

పిరమిడ్ శక్తికి సంబంధించిన ప్రయోగపూర్వకమైన ప్రామాణిక గ్రంధాలు ఎన్నింటినో పరిశీలించి .. “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” అన్ఏకానేక ప్రయోగాలను అనుభవపూర్వకంగా నిర్వహించి .. ధ్యానంతో పాటు, పిరమిడ్ నిర్మాణాలను కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. ధ్యానశక్తినీ, పిరమిడ్ శక్తినీ ప్రపంచానికి పంచుతూ వున్న “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” ప్రస్తుత ప్రధాన కర్తవ్యం భూగ్రహం అంతా పిరమిడ్ శక్తి తో నింపడమే!

ఆ కృషి ఫలితంగానే గత ముప్పై సంవత్సరాలలో కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే పదివేలకు పైగా చిన్నాపెద్దా పిరమిడ్‌లనూ మరి దేశవ్యాప్తంగా వందలాది పిరమిడ్‌లను నిర్మించుకోవడం జరిగింది!

వేల సంవత్సరాల క్రితం గ్రేట్ గిజా పిరమిడ్ నిర్మాణంలో పాల్గొన్న అట్లాంటిక్ నాగరికతకు చెందిన వారే నేటి “పిరమిడ్ మాస్టర్లు” కనుక మన ఉద్యమానికి “పిరమిడ్” అన్నది సంకేతంగా ఇవ్వబడింది.

అందుకే ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఇప్పటి వరకూ అనేకసార్లు ఈజిప్ట్ దేశానికి వందలాది మంది పిరమిడ్ మాస్టర్లతో ధ్యానయాత్రలను జరిపింది. ఈజిప్ట్ ప్రభుత్వ అనుమతులతో గ్రేట్ గిజా పిరమిడ్‌లోని కింగ్స్ ఛేంబర్ మరి క్వీన్స్ ఛేంబర్‌లలో పౌర్ణమి సామూహిక ధ్యానం జరిగింది.

విశ్వమయప్రాణశక్తి యొక్క శక్తిపాతానికి “అక్షయ పాత్ర” లాంటి గిజా పిరమిడ్ .. మనం కట్టిన ప్రతి ఒక్క పిరమిడ్‌కూ తన అనంతశక్తిని అందిస్తూనే వుంది. శాస్త్రీయమైన పిరమిడ్ కట్టడాలు అన్నీ కూడా ఆ శక్తిని గ్రహించి భూమిని కూడా మరింత శక్తివంతం చేస్తున్నాయి.

“పిరమిడ్ లో ధ్యానం” అన్నది ఎన్నో రెట్లు శక్తివంతంగా వుంటుంది. కనుకనే, ఎంతోమంది పిరమిడ్‌లో ధ్యానం చేసుకుని శారీరక స్వస్థతనూ, మానసిక ప్రశాంతతనూ మరి అత్యవసరమైన ఉన్నతినీ పొందుతున్నారు. పూర్వం మునులు, ఋషులు ధ్యానశక్తికోసం అడవులకో, కొండ కోనలకో వెళ్ళి ధ్యానం చేసుకునేవారు. నకారాత్మక కాలుష్యంతో నిండివున్న ఈ జనారణ్యంలో వాళ్ళకు ధ్యానశక్తి లభించకోపోయేది.

అయితే, ప్రస్తుతం మనకు ఈ శక్తి కట్టడాలు అందుబాటులోకి రావడం వల్ల ఎవ్వరూ కూడా తమ తమ ఇళ్ళను వదిలి అడవులకు పోవలసిన అవసరం లేకుండానే సుఖవంతంగా సంసారాలు చేసుకుంటూనే, ప్రాపంచిక ఉద్యోగలు చేసుకూంటూనే భౌతికజీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే .. రోజుల్లో కాస్సేపు పిరమిడ్‌లో ధ్యానం చేసుకుని శక్తివంతులుగా మారుతున్నారు!

పిరమిడ్‌లో ధ్యానం ద్వారా ఉన్నత తలాల మాస్టర్లతో చాలా తక్కువ సమయంలోనే మనం అనుసంధానం కాగలుగుతాము.