పుత్రుడు – పున్నామనరకం

 

“పున్నామనరకం”
“పునః + నామ + నరకం”
అంటే
“మళ్ళీ మళ్ళీ ‘నామం’ తీసుకునే ‘నరకం’”

అంటే “పునర్జన్మ” అన్నమాట

“పుత్రుడు” అంటే, “వారసుడు”
మన గుణగుణాలను సంతరించుకున్నవాడు
మన జ్ఞానాన్ని పోలివున్న చతురతను గ్రహించినవాడు
కనుక
“పుత్రుడు మనల్ని ‘పున్నామ నరకం’ నుంచి తప్పిస్తాడు”
అంటే
“మన ఆత్మశిష్యుల ద్వారానే మనకు జన్మరాహిత్య పదవి వస్తుంది” అన్నమాట
‘పుత్రుడు’ అంటే శారీరక వారసుడు కాదు, బుద్ధిపరమైన వారసుడు

* మనలాంటి ఆత్మజ్ఞానులను కొంతమందినైనా తయారుచేస్తేనే
మనకు మరుజన్మ నుంచి మరి విడుదల