పూజారి – to – పూర్ణాత్మ

 

“పూజారి”

 

  • ఆకులను, పువ్వులను కోసి, కోయించి ప్రకృతిని నాశనం చేసేవాడు.
  • చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లు, పెద్ద బొమ్మలైన విగ్రహాలతో ఆడుకునే ‘పెద్దబాలుడు’.
  •  

“మంత్రోపాసకుడు”

 

  • కొంచెం ఎదిగినవాడు. బొమ్మలాట వదిలివేసినవాడు. సాధనను నమ్ముకున్నవాడు. అయినా తనలోనే శక్తులన్నీ వునాయనీ గ్రహించినా, ఆ శక్తిని వెలుపలికి తీయడానికి ఏ సాధనా చెయ్యని మూర్ఖుడు.
  •  

“వేదాంతి”

 

  • ప్రకృతిని నాశనం చెయ్యని పండితుడు. ఆత్మతత్వాన్ని గ్రహించినా, తనలోనే శక్తులన్నీ వున్నాయనీ గ్రహించినా, ఆ శక్తిని వెలుపలికి తీయడానికి ఏ సాధనా చెయ్యని మూర్ఖుడు. తన పదజాలానికీ, వాక్చాతుర్యానికీ, తానే ముగ్ధుడయ్యే వెర్రివాడు.
  •  

“ధ్యాన సాధకుడు”

 

  • నిజమైన, తెలివైన మనిషి, తనలోనే శక్తులన్నీ వున్నాయని గ్రహించి వెంటనే ఆ శక్తిని వెలుపలికి తీయడానికి చేయవలసిన ధ్యానసాధనలో పూర్తిగా నిమగ్నమైనవాడు.
  •  

“అవధూత”

 

  • ధ్యానానుభవాలలో చాలా ముందుకు పోయినవాడు. నిరంతరం ఇతర లోకాలలో సూక్ష్మశరీర యాత్రల ద్వారా తిరిగేవాడు. అయితే, ఈ శరీరాన్ని ఈ లోకాన్ని నూటికి తొంభైపాళ్ళు త్యజించినవాడు. కనుకనే, ‘పిచ్చివాడు’ అని ఈ లోకపు పిచ్చివాళ్ళు అనుకుంటారు.
  •  

“సిద్ధుడు”

 

  • ధ్యాన పరాకాష్ఠను అందుకున్నవాడు. అష్టసిద్ధులను హస్తగతం చేసుకున్నవాడు. లోకం ఇతని సిద్ధులను చూసి భయపడుతుంది ; ఆశ్చర్యపోతుంది.
  •  

“బుద్ధుడు”

 

  • అందరి సిద్ధత్వానికీ, బుద్ధత్వానికీ దారి చూపేవాడు. ఆఖరి జన్మలో వున్నవాడు. నిరంతరం ధ్యాన, జ్ఞాన బోధ చేసి ఆ ఆకలి కూడా తీరిపోయిన తరువాత ఇంక మళ్ళీ జన్మ ఎత్తడు.
  •  

“ఒకానొక పూర్ణాత్మ”

 

  • సత్యలోకంలో ‘తార’ గా శాశ్వతంగా నిలిచిపోయి, తన లోంచి నూతన అంశాత్మలను సృష్టించి, వారినీ జనన-మరణ చక్రంలో ప్రవేశపెట్టి వారు కూడా బుద్ధులయ్యేంతవరకు వారి బాగోగులను చూసుకునేవాడు.
  •  

‘సిద్ధుడు’ అవ్వాలంటే ధ్యానం చేయాలి.

‘సిద్ధత్వానికి దారి చూపించడం” అంటే ధ్యానం చేయించడం

‘బుద్ధుడు’ అవ్వాలంటే ధ్యాన జ్ఞాన బోధ నిరంతరం చెయ్యాలి.

“బుద్ధత్వానికి దారి చూపించడం” అంటే అందరిని ధ్యాన జ్ఞాన బోధకులుగా తయారు చేయటం.