పేరు లో హోరు

 

పేరు పేరు కాదు; పేరులో దాగి వుంది మహా – హోరు.

స్వామి అంటే తనను తాను స్వాధీన పరచుకున్నవాడు.

సాధువు అంటే సరళ స్వభావం ఉన్నవాడు.

మౌని అంటే ఎక్కువగా మౌనంలో ఉండేవాడు.

ఋషి అంటే దివ్యచక్షువును ఉత్తేజింప చేసుకున్నవాడు.

మహాఋషి అంటే దివ్యచక్షువుతో సమస్త సృష్టి రహస్యాల్నీ చూసేవాడు.

సజ్జనులు అంటే సత్య స్వరూపాన్నిసూత్ర ప్రాయంగానైనా తెలుసుకున్నజనులు.

భగవాన్ అంటే శాశ్వత భాగాన్నిపొందిన భాగ్యవంతులు.

మహాత్మ అంటే తన్ను తాను అందరికీ సమర్పించుకున్న ఆత్మ. పరమాత్మ అంటే తన్ను తాను అందరికీ సమర్పించుకున్న వాళ్ళలో నెంబర్ : 1 అన్నమాట; ఆధ్యాత్మిక శాస్త్ర పరమైన మహాత్ములను పరమాత్ములంటారు. పేరులో ఏముంది? అనరాదు.

పేరులో సర్వస్వమూ దాగి ఉంది; పేరులో మహా హోరు ఉంది.