ముముక్షువు యొక్క శత్రువులు

 

నాలుగు రకాల శత్రువుల నుంచి “ముముక్షువు” అనబడేవాడు తనను తాను రక్షించుకోవాలి, అవి –

1) భయం

2) పరిమితజ్ఞానం

3) సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం

4) వృద్ధత్త్వపు భావనలు

“భయం” ముముక్షువు యొక్క మొదటి శత్రువు

ముముక్షువు ముందుగా అన్నిరకాలయిన భయాలనూ జయించాలి

అప్పుడే “జ్ఞానం” అన్నది మొలకెత్తుతుంది.

అయితే, ప్రాథమిక, పరిమిత జ్ఞానాన్నే “పూర్ణజ్ఞానం” అనుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

“పరిమిత జ్ఞానం” అన్నదే ముముక్షువు యొక్క రెండవ శత్రువు ఆ గండం నుంచి తప్పించుకోగలిగితే సిద్ధులు సంక్రమిస్తాయి

సిద్ధులు సంక్రమించి గర్వం సంభవిస్తే అది తిరిగి పతనానికి దారి తీస్తుంది.

సిద్ధులను సంపాదించి తీరాలి; అయితే గర్వం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.

సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం” అన్నదే ముముక్షువు యొక్క మూడవ శత్రువు.

అది జయించిన తరువాత కూడా చిట్టచివరి వరకూ,

అంటే జీవితంలో ఆఖరి శ్వాస తీసుకునే వరకూ,

అలసటకు – అంటే “వృద్ధత్వ భావన”లకు ఎప్పుడూ లోను కారాదు

వృద్ధత్వపు భావన” అనేది ఒకానొక ముముక్షువు యొక్క అంతిమ శత్రువు.

  • భయంపరిమిత జ్ఞానంసిద్ధులు సృష్టించే అహంకారంవృద్ధత్వ భావనలు ..  ఈ శత్రువులను నాల్గింటినీవరుస క్రమంలోచకచకా  జయించాలిఆఖరి శ్వాస వరకూ శత్రువుల బారి నుంచి రక్షించుకుంటూ ఉండాలి.