శివుడు – మూడవకన్ను

 

శివుడికి
“మూడవకన్ను” ఉంటుందట
“మూడవకన్ను” తెరిస్తే అంతా భస్మమవుతుందట
నిజమే !

“శివ” అనే పదానికి “ఆనందం” అని ఒక అర్థం
“మంగళకరం” అనే మరో అర్థం కూడా ఉంది
కనుక, “శివుడు” అంటే “ఆనందమయుడు” అని
“మంగళకర జీవితం జీవిస్తున్నవాడు” అని
అయితే, ఈ “శివ పదవి” ఎలా సాధ్యం ?

ఎవరైతే తమ తమ “మూడవకన్ను” ను
అంటే “ఆత్మచక్షువు” ను
అంటే, “అతీంద్రియ శక్తులను” ఉత్తేజపరచుకుంటారో
వారందరూ శివుళ్ళే అవుతారు
“మూడవకన్న ” ఉన్న ప్రతి మనిషీ “శివుడు” అనబడతాడు
ఎప్పుడైతే మన దివ్యచక్షువు సంపూర్ణంగా విచ్చుకుంటుందో
అప్పుడే మన అజ్ఞానం భస్మమవుతుంది
అప్పుడే, మన వికారాలు భస్మమయి అంతమవుతాయి

* ధ్యానం ద్వారానే “మూడవకన్ను” ఉత్తేజితమయి
“శివ పదవి” లభ్యమవుతుంది
* “మూడవ కన్ను” ఉత్తేజితమయితే
ఇక “మాయ” అంతా భస్మమవుతుంది