మాస్టర్ C.V.V.

 

ఎంతో మంది యోగులు

ఎంతో మంది మహానుభావులు

ఎందరో మాస్టర్స్

అందరికీ వందనాలు

మాస్టర్ c.v.v. నమస్కారమ్స్

తాను స్వయంగా మాస్టర్ అయి ఎంతోమంది మాస్టర్స్‌గా కావడానికి ప్రోత్సహించిన మాస్టర్ – మాస్టర్ c.v.v

ప్రతి ఒక్కరూ ఓ మాస్టర్ కావాలి

అదే అందరి మాస్టర్ల నిజమైన ఆకాంక్ష

ఓ మాస్టర్ ఎలా జీవించాలో తెలుసుకుని మనం కూడా అలాగే జీవించాలి

మాస్టర్స్ అయిన వారు ప్రపంచం కోసం ఎలా కష్టపడ్డారో గ్రహించి అలా మనం కూడా అలాగే కష్టపడాలి

అయితే, మంత్రాలను మరచిపోవాలి

మాస్టర్ c.v.v. నమస్కారమ్స్ అనే మంత్రం అయినా సరే

ఎప్పటికీ ఉపాసన కాదు మార్గం – విపస్సనే శరణ్యం

మంత్రాలన్నింటినీ మరచిపోవాలి…

శ్వాస మీద ధ్యాస అన్నది ఒక్కటే శరణ్యం

అప్పుడే మనం కూడా మాస్టర్స్‌గా అవుతాం

అప్పుడే మనం కూడా ఓ గురువుగా అవుతాం