“మహాభాగ్యం”

 

శారీరకపరంగా ఆరోగ్యమే మహాభాగ్యం మానసికంగా ప్రశాంతతే మహాభాగ్యం సామాజికపరంగా ప్రాణమిత్రులుండటమే మహాభాగ్యం ఆధ్యాత్మికపరంగా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే మహాభాగ్యం ఆహారపరంగా రెండు పూటలా రుచికరమైన తిండి వుండటమే మహాభాగ్యం కుటుంబపరంగా పరస్పరానుకూల దాంపత్యం కలిగి వుండటమే మహాభాగ్యం ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలనూ, చెట్లనూ పెంచగలగడమే మహాభాగ్యం పక్షులనూ, జంతువులనూ పోషిస్తూ, వాటిని సంరక్షిస్తూ వుండగలగడమే మహాభాగ్యం రోజంతా కష్టపడి తరువాత కొన్ని గంటలైన సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం ప్రతిరోజూ చక్కటి సునాదమైన సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం సంగీతానికి మైమరచి అప్పుడప్పుడూ నృత్యం చేయగలగడమే మహాభాగ్యం రోజుకో ఆట, అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం మహానుభావుల పుస్తకాలు చదవడమే మహాభాగ్యం రోజుకో గంటసేపు సజ్జనులతో గోష్ఠి చేయడమే మహాభాగ్యం రకరకాల కళలను పరిచయం చేసుకోవడమే మహాభాగ్యం రోజుకో గంటసేపు మౌనంగా ఉండటమే మహాభాగ్యం మనకు తెలిసినవి ఇతరులకు నేర్పించటమే మహాభాగ్యం కొండల్లో, లోయల్లో, అడవుల్లో ఏకాంతంగా వుండగలగడమే మహాభాగ్యం నివసిస్తున్న ఇల్లు పరిశుభ్రంగా వుంచుకోగలగటమే మహాభాగ్యం ప్రతి సూర్యోదయాన్నీ, ప్రతి సూర్యాస్తమయాన్నీ, పున్నమి ప్రశాంతతనూ .. ప్రకృతి అందాలను కనులవిందుగా అనుభవించగలగటమే మహాభాగ్యం నదీస్నానాలు, సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం చిన్నపిల్లలతో అన్నీ మరిచిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం కళ్ళు మూసుకుని ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టడమే మహాభాగ్యం!

 

– తులసీ వనంలో నుంచి ..