“లౌకిక ప్రేమ – అలౌకిక ప్రేమ – తల్లిప్రేమ”

 

“ప్రేమ”

“ప్రేమ” అంటే ఏమిటి? “ప్రేమ” అంటే “ఎంతో ఇష్టం”గా ఉండటం| ఏమిటో ఆ “ఎంతో ఇష్టం”?!

“లౌకిక ప్రేమ”

అనాదిగా కవులందరూ .. పండితులందరూ .. దాని వెంట పడీ, పడీ ప్రేమ తత్త్వానికి నిజమైన న్యాయాన్ని చేకూర్చలేక .. చేతులు కాల్చుకున్నారు సత్యరూపమైన “ప్రేమ”ను అర్థం చేసుకోవటం సామాన్య కవులకూ, పండితులకూ అసంభవం సామాన్యులకు అర్థం అయినదే “సామాన్య ప్రేమ” సామాన్యుల ప్రేమ సగుణాత్మకం “ప్రేమ” అనేది సకల ప్రాణికోటిలోనూ సహజంగా ఉన్న మైత్రీ భావం .. ఐక్యభావం .. తాదాత్మ్యతా భావం “ప్రేమ” అనేది ప్రత్యేకమైనది కాదు .. సర్వసాధారణమైనది .. బ్రహ్మాండాలలో .. సకల జీవులలో కేళీ విన్యాసం చేస్తూన్న మౌలికమైన భావ పటిమ.

“అలౌకిక ప్రేమ”

వాస్తవానికి “ప్రేమ” అన్నది “అంతర్గత బ్రహ్మజ్ఞాన వాహిని“ తాము గమనించినా .. గమనించకపోయినా అంతర్గతంగా అందరూ “బ్రహ్మజ్ఞానులే”! తమకు తెలిసినా .. తెలియకపోయినా అందరూ అంతర్గతంగా “బ్రహ్మం” అయి ఉన్నారు అందరిలోనూ సరిసమానంగా ప్రవహిస్తూన్న ఈ అంతర్గత “బ్రహ్మజ్ఞాన వాహిని” ప్రయత్నపూర్వకంగా .. యోగసాధన మూలంగా .. బహిర్గతమైనప్పుడు “మేం బ్రహ్మజ్ఞానులం” అని ఎవరికి వారు తెలుసుకుంటూ ఉంటారు. “ఆ అంతర్గత వాహిని బహిర్గతంగా పొంగిపొరలి పెనుతుఫాను అయినప్పుడు” అనేకమంది దాన్ని గమనించి “అహో! బ్రహ్మజ్ఞాని తత్త్వం!” అంటారు. “అలౌకిక ప్రేమ” అన్నది “నిర్గుణాత్మకం”

“తల్లి ప్రేమ”

ఇకపోతే “తల్లి ప్రేమ” సకల సృష్టిలోనూ ఒకే విధంగా వ్యాప్తంగా ఉన్న ఈ “మైత్రీభావన” ఈ “ఐక్య భావన” .. తల్లి బిడ్డ పరిస్థితుల్లోనూ .. మరింత ఘనీభవించి మరింత ప్రస్ఫుటమై, నిరుపమానమై, పెల్లుబికిన బ్రహ్మజ్ఞానానికి సాటిదై విలసిల్లుతోంది!

“పిరమిడ్ మాస్టర్లు”

“పిరమిడ్ మాస్టర్లు” అందరూ బ్రహ్మజ్ఞానులు! “పిరమిడ్ మాస్టర్లు” కానివారికి అనుభవంలోనికి వచ్చేది “సామాన్య లౌకిక ప్రేమ” అయితే “పిరమిడ్ మాస్టర్లు”గా అయినవారికి అనుభవంలోనికి వచ్చేది “అలౌకిక తల్లి ప్రేమ” “సాధారణ ప్రేమ” కొంత స్వార్థాన్ని సంతరించుకుంటుంది .. “తల్లి ప్రేమ” పూర్తి నిస్వార్థాన్ని పుణికి పుచ్చుకుంటుంది. “ప్రేమ” కొంత ఊగిసలాడేది .. “తల్లి ప్రేమ” నిశ్చలంగా ఉండేది

“ఆది – తుది”

“లౌకిక ప్రేమ”కు ‘ఆది’ ఉంది .. మరి సదా ‘తుది’ అన్నది ఉంది కానీ “తల్లి ప్రేమ”కూ .. “అలౌకిక ప్రేమ”కూ .. అది ఉంది గానీ ‘తుది’ అన్నది లేదు అది అనంత చైతన్య స్రవంతి లాగా సాగుతూనే ఉంటుంది.