లోకాః సమస్తా సుఖినోభవంతు

 

“మనస్సు అన్నదే మాయామృగం”

“మనస్సును మనస్సున చంపిన మనస్సందే మోక్షం” అన్నాడు మహాయోగి వేమన

“బంధానికీ, మోక్షానికీ మనస్సే కారణం” అన్నాయి ఉపనిషత్తులు

“The Mind in itself makes a Hell of a Heaven and Heaven of a Hell“

అన్నాడు జాన్ మిల్టన్

“మనస్సులోని మర్మం తెలుసుకో” అన్నాడు శ్రీ త్యాగరాజు

“యద్భావం తద్భవతి”

“As You Think So It Becomes” అన్నది సనాతన ఆధ్యాత్మిక సత్యం

“మనస్సు” అనేది నిరంతర ఆలోచనల పుట్ట .. లెక్కలేని తిక్క ఆలోచనల బుట్ట

ఎక్కువగా హానికరపు ఆలోచనలు, తక్కువగా లాభకరపు ఆలోచనలు .. ఈ రెండింటి కలగలుపే “మనస్సు”

అయితే ఎప్పుడైతే ఆనాపానసతి అభ్యాసం ద్వారా ధ్యానం ప్రారంభిస్తామో

ఎప్పుడైతే స్వాధ్యాయ, సజ్జనసాంగత్యాదుల ద్వారా జ్ఞానాన్ని సమీకరించుకుంటామో

“మనస్సు యొక్క మహాశుద్ధీకరణ” అప్పుడే ప్రారంభమౌతుంది

“మనస్సు పుట్ట”లోని పనికిరాని ఆలోచనలు అనే ‘కలుపు’ను తీసివేయడం జరుగుతుంది

“మనస్సు బుట్ట”లోని హానికరపు ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనల ‘కలుపుతీత’ జరుగుతుంది

తద్వారా ఆలోచనల పుట్ట, ఆలోచనల బుట్ట యొక్క పూర్ణ ప్రక్షాళన జరుగుతుంది

మిగిలిపోయిన లోకకళ్యాణకర ఆలోచనల ద్వారా మరి మహాలోకకళ్యాణమే జరుగుతుంది

“దేహశుద్ధి” అన్నది నీటి ద్వారా మాత్రమే జరుగుతుంది .. ఇది అందరికీ సువిదితం

అయితే “మనోశుద్ధి/ఆత్మసిద్ధి” అన్నవి మాత్రం కేవలం

ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదుల ద్వారానే సాధ్యం

కనుక

ఇతోధికంగా ఆనాపానసతి ధ్యానసాధనలో మరి మునుగుదాం

ఇతోధికంగా స్వాధ్యాయ సజ్జనసాంగత్యాదులను మరి నెరపుదాం

మరి ఇతోధికంగా లోకకళ్యాణ కారణభూతులం అవుదాం

2014 డిసెంబర్ 18 నుండి

“కైలాసపురి – కడ్తాల్”లో జరుగబోతూన్న

మహాలోకకళ్యాణకర కార్యక్రమమైన అయిదవ ధ్యానమహాచక్రానికి

మనమందరం శాయశక్తులా తోడ్పడుదాం

సకల నక్షత్రమండలాల వాసులందరూ మెచ్చుకునే విధంగా 

అయిదవ ధ్యానమహాచక్రాన్ని “కైలాసపురి”లో ఆత్మపండుగగా జరిపిద్దాం ..

లక్షలాదిగా పిరమిడ్ ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడానూ

మరొక్కసారి సంఘటితంగా చేసే ధ్యానమహాయజ్ఞానికి అంకితమవుదాం

 సమిష్టిగా “తన్”, “మన్”, “ధన్” సమర్పించుకుందాం

భూదేవి, భూమాత మన అందరినీ ఆశీర్వదించుగాక!

***

పిరమిడ్ ధ్యానులందరికీ .. పిరమిడ్ మాస్టర్లందరికీ ..

ధ్యానమహాచక్రం – V సందర్భంగా శుభాకాంక్షలు!

“లోకాః సమస్తా సుఖినోభవంతు”