క్షణ క్షణం జాగ్రత్త

 

“క్షణక్షణ జాగ్రత్త”

అనేది ధ్యానం ద్వారానే,

దివ్యజ్ఞానప్రకాశం ద్వారానే,

మనకు లభ్యమయ్యే స్థితి.

ఈ స్థితిలో “సదా మెలకువ” తో

వుండడం జరుగుతూ ఉంటుంది.

ఎప్పుడూ “వర్తమాన స్ఫూర్తి” నే కలిగి వుంటాం.

భూత భవిష్యత్ కాలాల ఛాయలు వర్తమానం మీద

ప్రణాళిక భద్ధంగా

కావలంటేనే పడతాయి; అనుకుంటేనే వుంటాయి.

ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థి,

ధ్యానంలో నిష్ణాతుడైన తరువాత,

దివ్యజ్ఞానప్రకాశం కలిగిన తరువాత,

పూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైన తరువాత,

నిరంతరం అభ్యాసం చేయవలసిన స్థితే

నిత్య జాగ్రత్త అదే “క్షణ క్షణ జాగ్రత్త (awareness) “

మన “లోపలి” పరిస్థితులు కానీ,

మన “బయటి” పరిస్థితులు కానీ,

క్షణక్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి.

ఏదీ స్థిరమైనది కాదు, ప్రతీదీ తాత్కాలికమే;

ప్రతీదీ చైతన్యవంతమే, ప్రతీదీ రూపుమారేదే.

 

  • నిరంతరంగా మారే లోకంలో, ప్రస్తుత సందర్భాన్నీ, ప్రస్తుత సమస్యనూ గుర్తించి దానికి అనుగుణంగా ప్రతిక్షణమూ జాగరూకతతో మెలగడమే క్షణక్షణ జాగ్రత్త స్థితి