క్రియా యోగం

 

 

“క్రియా” అంటే “చర్య” . . “విషయం”
“యోగం” అంటే  “చేయవలసిన సాధన”
కనుక, “క్రియా యోగం” అంటే
“తప్పనిసరిగా చేయవలసిన సాధనా చర్య. సాధనా విషయం”.

“తపః స్వాధ్యాయ ఈశ్వరప్రణిధానేన క్రియాయోగః” –
ఇది పతంజలి మహర్షి చెప్పిన రాజయోగ సూత్రాలలో ప్రధానమైనది.

“తపస్సు” , “స్వాధ్యాయం”, “ఈశ్వరప్రణిధానం” –
అసలైన అనబడే మూడు ప్రక్రియలూ సంపూర్ణంగా కలిస్తేనే
“క్రియా యోగం” అవుతుంది.

కనుక, చేయవలసినవి :

  • “తపస్సు” అంటే శారీరకమైన, భౌతికమైన అవసరాలను .. అంటే నిద్ర, తిండి మొదలైన వాటిని .. క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడం.
  • “స్వాధ్యాయం” .. అంటే ఆత్మవికాసానికి నూటికి నూరుశాతం దోహదకారి అయ్యే గ్రంథాలను అధ్యయనం క్రమక్రమంగా అధికం చేయడం
  • “ఈశ్వరప్రణిధానం” .. అంటే ” అంతా దైవమయం”, “సర్వం ఖల్విదం బ్రహ్మ” అన్న ఎఱుకను సదా కలిగివుండడం

ధ్యానం అభ్యాసం ద్వారానే ఈ మూడూ సాధ్యం
వేరే మార్గం లేదు అన్యధా శరణం నాస్తి.