కష్టే ఫలే – కృషితో నాస్తి దుర్భిక్షం

 

“2019 – జనవరి 1వ తేదీ”

భూమండలంపై గొప్ప మార్పుకు నాంది పలికిన రోజు!

భూమి తన బాలారిష్టాలను దాటి స్థిరంగా నడవటం ఆరంభించిన రోజు ..

భూమిపైన నకారాత్మకతపై సకారాత్మకత పైచేయిగా మారిన రోజు ..

భూమండలంపై శాంతి సౌహార్ద్రాల సుస్థిరతకు నాంది పలికిన రోజు ..

ఇది పిరమిడ్ మాస్టర్లందరికీ, PSSM కూ మహా పండుగ రోజు ..

ఇంతవరకూ .. ఇన్ని దశాబ్దాలుగా .. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏటికి ఎదురీది

ఎదురీది ..

నిర్విరామ కృషితో, అకుంఠిత దీక్షతో దీనిని సాధించారు

ఇక మీదట “ఎదురీత” లేదు ..

అంతా “వాలు ఈత”యే .. గాలి వాటం మారింది!

***

ఇన్ని సంవత్సరాలూ .. ఇన్ని దశాబ్దాలూ .. భూమిపైన

ముళ్ళ పొదలు నరికి, దుక్కిదున్ని, నారు పోసి, నీరు పోసి, నాటు వేసి, కలుపు

పీకాం!

ఇప్పుడు పైరు పెరిగి చేతికి వచ్చింది ..

ఇక నెమ్మది నెమ్మదిగా కోత కోసుకుంటూ ధ్యానం సేకరించే సమయం ఆసన్నమైంది!

నిండుగా పండిన పైరును కళ్ళారా చూసుకుంటూ కోసుకుందాం!

ధాన్యపు రాసులు అందరికీ పంచుదాం!

ధ్యాన జ్ఞాన ఫలాలను అందరికీ చేరువచేద్దాం!

ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ..

ఆట పాటలతో ధ్యాన జ్ఞాన ప్రచారాలు చేద్దాం

ఆటలో అరటి పండులా పిరమిడ్ నిర్మాణాలు చేద్దాం!

అవని ఉన్నతీకరణను వేగవంతం చేద్దాం!

***

“2019 – జనవరి 1వ తేదీ”

ఒక గొప్ప యుగ మార్పు!

ఇక పిరమిడ్ మాస్టర్లందరికీ గొప్ప భోగమే!

యోగులకే భోగాలు!

యోగులు కాని వారికి రోగాలే!

ధ్యానులకు శేష జీవితమంతా వైభోగమే!

***

ఇక మీద పిరమిడ్ మాస్టర్లు అనేకానేక విజయాలను అత్యంత సునాయాసంగా

సాధిస్తారు

అవని ని అంతా సునాయాసంగా ధ్యానమయం చేస్తారు ..

భూమండలం మొత్తాన్నీ వేగవంతంగా శాకాహారమయం చేస్తారు

“అహింసా పరమో ధర్మః”ను ఎలుగెత్తి చాటుతూ

అత్యంత సునాయాసంగా ప్రపంచవ్యాప్తంగా అహింసను పాటింప చేస్తారు!

దశదిశలా పిరమిడ్‌లు నిర్మించి భూమండలాన్ని ఎంతో శక్తివంతం చేస్తారు!

అయితే .. అత్యల్ప కృషితో .. సంకల్ప మాత్రంగా ఇవన్నీ సాధిస్తారు

***

2019 జనవరి 1 ముందు “ఆయాసం”

2019 జనవరి 1 తరువాత “సునాయాసం”!

కష్టే ఫలే!

కృషితో నాస్తి దుర్భిక్షం!

2019 సంవత్సరం పూర్వం అంతా కృషి .. అంతా కష్టమే!

2019 సంవత్సరం నుంచి అంతా సుభిక్షం .. అంతా ఫలమే!

జై PSSM! జై జై పిరమిడ్ మాస్టర్స్!