“కర్తవ్యం దైవమాహ్నికమ్”

 

  మనుష్యులు రెండు విధాలుగా ఉన్నారు: కేవలం ఇహలోకాన్నే నమ్ముకున్నవారు .. ఒక పక్షం సకల లోకాలూ ఉన్నాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు .. రెండవ పక్షం  మనుష్యులు రెండు విధాలుగా ఉన్నారు: “నేను భౌతిక శరీరం” అనేవారు .. ఒక పక్షం “నేను సర్వాత్మను” .. “మమాత్మా సర్వ భూతాత్మా” అన్నవారు .. రెండవ పక్షం మనుష్యులలో రెండు పక్షాలు ఉన్నాయి: మొదటి పక్షం .. ప్రాపంచిక కోరికలతో ఊగిసలాడే వారు రెండవ పక్షం .. ఆధ్యాత్మిక కర్తవ్యాలకు అంకితమైపోయిన వారు రెండవ పక్షం .. దైవ కార్యాలకు అంకితమైపోయిన వారు “కౌసల్యా సుప్రజా రామా .. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల .. కర్తవ్యం దైవమాహ్నికమ్” భావం: “కౌసల్యాదేవి సుపుత్రుడా! శ్రీరామా! సూర్యోదయానికి పూర్వమే లేవాలి లేచి ఓ పురుషోత్తమా! దైవ కార్యక్రమాలు ముందున్నాయి” అలాంటి “రెండవ విధంగా” ఉన్న “పురుషోత్తములు” అందరూ మరి ప్రొద్దున్నే లేచి  ‘దైవ కార్యక్రమాలు’ అనే కర్తవ్యంలో నిమగ్నమవ్వాలి

***

పిరమిడ్ మాస్టర్లందరూ “పురుషోత్తములు” పిరమిడ్ మాస్టర్లందరూ “రెండవ కోవ”కు చెందినవారు ప్రొద్దున్నే లేచి వీరంతా కూడానూ ధ్యానప్రచార కార్యక్రమాలకు నిరంతరం అంకితమైనవారు ముఖ్యంగా, ఇప్పుడు మన ముందున్న ధ్యానమహాచక్ర కార్యక్రమాలకు అంకితమైనవారు “కర్తవ్యం శరణం గచ్ఛామి .. తక్షణ కర్తవ్యం శరణం గచ్ఛామి” నేటి కర్తవ్యం నేడు – రేపటి కర్తవ్యం రేపు ప్రస్తుతం వచ్చేస్తోంది .. మరి వచ్చేసింది .. “ధ్యానమహాచక్రం – IX” ధ్యానమహాచక్రానికి మరింతగా నడుము బిగిద్దాం మరి విశేషంగా సకల నిధులనూ, సకల వనరులనూ సేకరిద్దాం ధ్యానులు కాని వారందరినీ సంతోషంగా పిలుచుకుందాం ధ్యానమహాచక్రంలో అందరినీ “ధ్యానాగ్ని”లో కాల్చుదాం అందరికీ చక్కటి ధ్యాన ప్రవచనాలు వినిపిద్దాం ధ్యానమహాచక్రంలో పాల్గొనే వారందరికీ చక్కటి విందు భోజనాలు పెడదాం ఎవరి వంతు బాధ్యతలను వారు మహోన్నతంగా నిర్వర్తించాలి

***

బాధ్యత = భాగ్యం చిన్న చిన్న బాధ్యతలు = చిన్న చిన్న భాగ్యాలు పెద్ద పెద్ద బాధ్యతలు = పెద్ద పెద్ద భాగ్యాలు రకరకాల బాధ్యతలు = రకరకాల భాగ్యాలు ప్రాపంచిక బాధ్యతలు = ప్రాపంచిక భాగ్యాలు ఆధ్యాత్మిక బాధ్యతలు = పారలౌకిక భాగ్యాలు

***

బాధ్యత అనేది భాగ్యాన్ని కలిగిస్తుంది గొప్ప గొప్ప బాధ్యతలు అన్నవి మరి గొప్ప గొప్ప భాగ్యాలను కలిగిస్తాయి గొప్ప బాధ్యతలు వహించడానికీ .. మరి గొప్ప కార్యాలు నిర్వహించడానికీ గొప్ప అవకాశం ఏతెంచింది ఛలో టు “ధ్యానమహాచక్రం – IX”! ఛలో “కైలాసపురి .. కడ్తాల్” !!