జలాలుద్దీన్ రూమీ

 

పర్షియా దేశీయుడైన

“జలాలుద్దీన్ రూమీ”

గొప్ప సూఫీ మాస్టర్.

సుమారు 700 సంవత్సరాలు అయ్యింది ..

భూమండలం ఆ ధృవతారతో పులకించింది.

ఆయన చెప్పిన ఒకానొక సత్యవాక్కు:

“నేను ‘ఖనిజం’లా చనిపోయి ‘మొక్క’గా మారాను;

మొక్కగా చనిపోయి ‘జంతువు’లా పుట్టాను;

జంతువుగా చనిపోయి ‘మనిషి’గా అవతరించాను;

ఇంక దేనికి భయపడాలి నేను ?

చనిపోవడం వలన నేను ఎప్పుడు నష్టపోయాను ?

అంతేకాదు, మనిషి లాగా కూడా చస్తాను ;

చనిపోయి ‘దేవత‘గా దేవలోకాలకు వెళ్తాను.

అక్కడి నుంచి కూడా ఇంకా ఇంకా పై లోకాలకు వెళ్ళవచ్చు.

ఇంకా పైపైకి వెళ్ళి, ఎవ్వరూ ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో ?”

 

  • ఆత్మకు ఎన్నో జన్మలుమరెన్నో లోకాలుఅనంతమైన అనుభవాలు.
  • జీవితం అనేది అనంతమైనశాశ్వతమైన పరిధులు లేనిమహావినోదమహావిజ్ఞాన యాత్ర” ..
    ఇదే శ్రీ జలాలుద్దీన్ రూమీ జీవిత అనుభవసారం.