” జై మహిళా ధ్యానమహాచక్రం”

 

“2019 – మహిళా ధ్యానమహాచక్రం” .. ఓ యుగమార్పిడికి సంకేతం!
మహిళలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని నిర్వహించేదే ఈ ” మహిళా ధ్యానమహాచక్రం”!

“పురుషాధిక్య యుగం” అంతరించిపోయే శుభతరుణం ..
” స్త్రీ ఆధిక్య యుగం” ప్రారంభించనున్న మహాతరుణం!
” సాధికార దివ్య స్త్రీ చైతన్యశక్తి” తో కూడిన సరిక్రొత్త దివ్య యుగానికి నాంది పలికే రోజు!

పురుషుడు + ధ్యానం = స్త్రీ
మానవుడు + హింస + మాంసభక్షణ = క్రూర జంతువు

ఇక పురుషులందరూ తమ తమ పురుషాధిక్యతను సగం తగ్గించుకుని
స్త్రీ సహజ సుగుణాలు అయిన ప్రేమ, కరుణ, సహనం మరి శాంతం వంటి
దివ్యలక్షణాలను సంతరించుకునే మహాసమయం ఆసన్నమైంది!
నిరంతరం ధ్యాన సాధనతోనే ఒకానొక పురుషుడికి మరి స్త్రీ సహజ సుగుణాలు అలవడుతాయి ..
ఒక్క ధ్యాన సాధనతోనే .. పురుషుడు స్త్రీ తో సమానంగా నిలువగలుగుతాడు!
ఒక్క అహింసతోనే మానవుడు జంతువులతో సరిసమానంగా నిలవగలుగుతాడు
హింసలో ఉన్న మానవులు ..
జంతు వధలో వున్నవాళ్ళు .. జంతు మాంస భక్షణ చేసేవాళ్ళు ..
సకల జంతువుల కంటే కూడా హీన స్థితిలో ఉన్నవాళ్ళు!

అలాగే మానవజాతిలో ధ్యాన అభ్యాసం లేని పురుషుడు
స్త్రీలతో పోల్చుకుంటే ఎంతో హీనస్థితిలో వున్నవాడు!
ప్రతి పురుషుడూ “అర్థనారీశ్వరుడు” కావాలి .. అది తప్పనిసరి!

స్త్రీ + ధ్యానం + అహింస + శాకాహారం = అసాధారణ స్త్రీ

అలాగే ప్రతి స్త్రీ కూడా కాస్త పురుషత్వాన్ని కలిగి వుండాలి .. అది కూడా తప్పనిసరి!
అప్పుడే ఆమె ఈ ప్రపంచాన్ని ఏలగలదు! మరి మానవాళికి చక్కటి దారి చూపించగలదు!
సభ్యసామాజిక రంగంలో ముందంజలో ఉండగలదు!
ఒకానొక స్త్రీకి ఆ కాస్త పురుషత్వాన్ని కూడా ఆపాదించి పెట్టగలిగేది ఆనాపానసతి ధ్యానమే!
ధ్యానసాధన వల్లనే ఒకానొక స్త్రీ తన గొప్పతనాన్ని తాను గుర్తించుకోగలుగుతుంది!

ధ్యానసాధనలో మునిగి తేలి గొప్ప మాస్టర్లు అయిన
పిరమిడ్ పురుషోత్తములందరికీ మరి పిరమిడ్ మహిళా మణులందరికీ ప్రణామాలు!!

జై ధ్యానం! జై జై ధ్యానం !!
జై ధ్యాన జగత్! జై పురుష ధ్యాన జగత్!! జై మహిళా ధ్యాన జగత్!!!
జై మహిళా ధ్యానమహాచక్రం! డిసెంబర్ 21-31!
ఛలో కైలాసపురి! ఛలో కడ్తాల్!!