ఇప్పటికి … తృప్తిగా … భూమాత

 

మై డియర్ పిరమిడ్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్.

భూమాత … ఇప్పుడు … సంతోషం వ్యక్తపరుస్తోంది.

భూమాత … ఇప్పుడు … హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది.

భూమండలం … ఇప్పుడు … ఓ క్రొంగొత్త మలుపు తిరిగింది.

ఎందుకు ‘ఇప్పుడు’ ?

2004 సంవత్సరాంతానికల్లా భువి ఓ నూతన అధ్యాయంలో ప్రవేశించింది కనుక.

ఈ భువి ‘దివి’ గా మారడానికి కావల్సిన 1,44,000 మంది ఆత్మజ్ఞానులు ‘ఇప్పుడు’ ఈ భువిపై తయారయ్యారు,కనుక.

1987 కు ముందు ఈ భూమండలం మీద అలాంటి ఆత్మజ్ఞానులు కేవలం వందల్లోనే వున్నారు.

ఏదేని ఓ బృహత్తర కార్యక్రమానికి కనీస సంఖ్యలో కార్యశూరులు, ధీరులు, వీరులు తప్పనిసరిగా అవసరం. మహాభారత యుద్ధానికి మరి ఎంతమంది అతిరధులు, మహారధులు, అర్థరధులు అవసరం అయ్యారో అందరికీ తెలుసు.

అదే విధంగా ఈ భూమండలం ఓ నూతన విప్లవాత్మకమైన ఆధ్యాత్మిక శకంలో అడుగిడడానికి కూడా ఓ మౌలికమైన ఆత్మవీరుల సంఖ్య తప్పనిసరిగా అవసరం… అదే “ఒక లక్ష 44 వేల” మంది మాస్టర్లుగా లెక్క వేయబడింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విప్లవానికి కావలసిన 1,44,000 మంది ధ్యానులు – ఆత్మజ్ఞానులు ఈ భువిపై … మన పిరమిడ్ మాస్టర్ల విశేష కృషి వల్ల … తీర్చిదిద్దబడ్డారు.

2012 నాటికి “ధ్యాన జగత్” లక్ష్యంగా ఇక వీరి కార్యక్రమాలు జగత్ వ్యాప్తమవుతాయి.

2012 నాటికి ఈ భూమిపై అశాంతి, అహింస, అవిద్యలు సమూలంగా మటుమాయం అవుతాయి.

అందుకే భూమాత తృప్తిగా ఊపిరి పీల్చుకుంటోంది.

అందుకే భూమాత పులకరించి పోతోంది.