“ఇది మన ధర్మం”

 

ఇది మన రాష్ట్రం .. ఇది మన దేశం .. ఇది మన ధర్మం .. ఇది మన పని! ఇది ఇంకొకకరి పని కానే కాదు. మనం అంతా కూడా ఎన్నో జన్మలు హిమాలయాలలో తపస్సు చేసి ఈ జన్మలో ” పిరమిడ్ పార్టీ ” లో చేరి .. ధర్మ సంస్థాపన కోసం వచ్చాం! పిరమిడ్ పార్టీలోకి అందరూ రావాలి .. అందరూ కలిసి చక్కగా పనిచేయాలి!

2014 ఎన్నికలకు మళ్ళీ మనం ఇప్పటీ నుంచే శంఖం పూరిస్తున్నాం. ఎన్నికల కోసం మనం ప్రతి జిల్లాలోనూ .. ప్రతి మండలంలోనూ కమిటీలు వేసుకుని, ప్రతి చోట సమావేశాలు చేసి .. పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకువెళ్దాం!

“ధ్యానంచేసే వాళ్ళకు రాజకీయం ఎందుకండీ?” చాలా మంది అడుగుతారు ! అది సహజం ! “ధ్యానం చేసేవారికే రాజకీయం” అని మనం చెబుదాం. ఎందుకంటే ఆత్మజ్ఞానులకు మాత్రమే రాజ్యాన్ని నడిపే నైపుణ్యత ఉంటుంది. మనకు ఏ ‘ ఆరాటం ’ లేదు, ఏ ‘ ఆయాసం ’ లేదు .. మరి ‘ ప్రయాస ’ అసలే లేదు ! హాయిగా కూర్చుని ధ్యానం చేస్తాం, పార్టీ గురించి చెప్తాం! ఈ భూమిపై ధర్మం స్థాపించడానికి కృషిచేస్తాడు!

‘ ప్రపంచంలో ఉన్న కుళ్ళును తీసి వేయటం కోసం కంకణం భూమిపై కట్టుకున్న వాడే కర్మయోగి ; దీన్నే ” కర్మయోగం ” అన్నారు కనుక ” ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడినే పిరమిడ్ పార్టీకి పనిచేస్తూంటాను. నేను ఒక్కడినే ధ్యానప్రచారం చేసుకుంటాను! ఇలా నా ధర్మం నేను చేస్తాను ” అనుకునేవాడే కర్మయోగి మరి ; దీనినే ‘ కర్మయోగం ’ అన్నారు.

“త్యాగం” ద్వారా అమృతత్వం వస్తుంది. “స్వార్థం”ద్వారా మృతత్వం వస్తుంది!” నేను అందరినీ కొల్లగొట్టుకోవాలి ” అనేది మృతత్వాని కి దారితీస్తే “నేను అందరికీ సహాయం చేయాలి” అనేది అమృతత్వానికి దారి తీస్తుంది.

మనకు రెండు దానాలు వున్నాయి: ఒకటి శరీరానికి దానం ; రెండవది ఆత్మకు దానం. శరీరానికి ‘అన్నదానం’ చేయాలి .. ఆత్మకు ‘జ్ఞానదానం’ చేయాలి! ‘ఆత్’ అన్నది జ్ఞానంతోనే సంతృప్తి చెందుతుంది మరి ‘శరీరం’ అన్నది అన్నంతోనే సంతృప్తి చెందుతుంది కనుక దేనికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. మనం ఒకటి ‘దేహం’, రెండవది ‘దేహి’ .. ఒకటి ‘శరీరం’, రెండు ‘ఆత్మ’. ‘మమాత్మ సర్వభూతాత్మ’ అన్నది ఆత్మ యొక్క తత్త్వం కనుక అంతటా వున్న ఆత్మకు మనం ఇవ్వవలసింది ‘జ్ఞానం’.

పిరమిడ్ ధ్యానకేంద్రాలకు వచ్చేవాళ్ళందరికీ ‘జ్ఞానదానం’ జరుగుతూనే వుంటుంది. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన మొదలుపెడితే .. పరమాత్మలుగా ఎదుగుతారు. రాముడు, కృష్ణుడు కూడా సంసారులే ! రాముడు వశిష్టుడు దగ్గర .. శ్రీకృష్ణుడు సాందీపుడి దగ్గర జ్ఞానం నేర్చుకున్నారు.

మీరు నాకు డబ్బు ఇవ్వవచ్చు కానీ .. నేను మీకు జ్ఞానాన్ని ఇవ్వలేను ! ఎవరికి వారే ధ్యానం చేసుకుని జ్ఞానాన్ని పొందవలసిందే !