గురువులు ఎప్పుడూ వున్నారు

 

“చెప్పేవాడు ఎప్పుడూ వున్నాడు, వినేవాడే లేడు” 
అనేవారు పరమగురువు శ్రీ సదానంద యోగి
జనవరి 1, 1981 లో నేను ఆ పరమాత్ముణ్ణి కర్నూలులో కలుసుకున్నాను ..
ఒక చిన్ని గదిలో .. ‘రాఘవేంద్ర లాడ్జి’ లో..
అప్పటి నుంచి ఆయనకు అంకితమైపోయాను ..
22 మే, 1983 వరకు .. ఆయన శరీర విరమణ చేసేంతవరకు ..

శిష్యుడు సరియైన స్థితిలో ఉన్నప్పుడు
గురువులు వచ్చి తీరుతారు 
భౌతికంగా కానీ, సూక్ష్మశరీరంతో కానీ,

కనుక
“మనం సరియైన స్థితిలో ఉన్నామా, లేదా ?” 
అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి
మనం సరియైన స్థితిలో లేకపోతే,
గురువులు భౌతికంగా మన ఇంట్లోనే వున్నా
మనకు ఎంతమాత్రం అర్థం కారు.

* ప్రాపంచిక శిష్యులకూ, కుచ్చితులకూ,
మోసగించే గురువులే దొరుకుతారు
మోక్షార్హులైన శిష్యులకు మోక్షం పొందిన గురువులే దొరుకుతారు