గురువు – పరమగురువు

 

నేటి శిష్యుడే
రేపటి గురువు
“గురువు అంటే “బరువైనవాడు” –
“జ్ఞానంతో బరువైనవాడు” అన్నమాట
“లఘువు” అంటే “తేలికగా ఉన్నవాడు”
“జ్ఞానం లేక తేలిపోయి ఉన్నవాడు” అని అర్థం

నేటి ముముక్షువు
రేపటి ముక్తపురుషుడు, గురువు
ధ్యానం ద్వారా దివ్యచక్షువును సంపాదించుకుని
ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే “గురువు”

అదే విధంగా
నేటి గురువే,
మరునాటి పరమగురువు
“పరమగురువు” అంటే
“చాలా చాలా బరువైనవాడు” అన్నమాట
అంటే “బ్రహ్మజ్ఞానంతో బరువైనవాడు” అన్నమాట 
నేటి ఋషే, రేపటి రాజర్షి, మరునాటి బ్రహ్మర్షి అవుతాడు

దివ్యచక్షువు సంపాదించుకున్నవాడు గురువు, ఋషి
దివ్య చక్షువును పరిపక్వం చేసుకున్నవాడే పరమగురువు బ్రహ్మర్షి