“గురుపౌర్ణమి” సందర్భంగాపత్రీజీ సందేశం

 

“ఒక సంవత్సరంలో ఉన్న 365 రోజులలో మనం .. 364 రోజులు .. మన కోసం బ్రతకాలి. మన ప్రాపంచిక అభివృద్ధి కోసం వివిధ రకరకాల ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను నిర్వర్తించాలి. రకరకాల సుకర్మలను చేపట్టాలి.”

“అలాగే మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా రకరకాల సాధనలు చేసుకోవాలి ధ్యానం, ధ్యాన ప్రచారం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, పిరమిడ్ నిర్మాణాలు అన్నీ శ్రద్ధగా చేసుకోవాలి.”

“ఇలా సంవత్సరంలలో 364 గడిపినా .. ఒక్కరోజు మాత్రం వీటన్నింటినీ ప్రక్కన పెట్టేయాలి. అదే గురుపౌర్ణమి శుభదినం. ఆ ఒక్కరోజు .. మిగిలిన ఆ 364 రోజులపాటు మన ప్రాపంచిక మరి ఆధ్యాత్మిక అభివృద్ధిలో మనకు సహాయపడిన ప్రతి ఒక్కరినీ గుర్తు తెచ్చుకుని .. వారికి పేరుపేరునా కృతజ్ఞతాపూర్వక ప్రణామాలను అర్పించాలి.”

“మనకు జన్మను ఇచ్చిన తల్లితండ్రులనూ మన తోబుట్టువులనూ, మన బంధువులనూ, ఉపాధ్యాయులనూ, మిత్రులనూ, శత్రువులనూ, సహాయకులనూ .. పిల్లలనూ జంతువులనూ, పక్షులనూ, జలచరాలనూ, వృక్షాలనూ ఇలా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా తలచుకుని .. వారందరినీ మన అభివృద్ధిలో సహాయపడిన గురువులుగా యెంచి .. వారికి ఆత్మపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజెయ్యాలి” అంటూ అందరితో “గైడెడ్ మెడిటేషన్” చేయించారు.”