దివ్యచక్షువు

 

“ఆనాపానసతి” అభ్యాసం వల్ల
“చిత్తం” అతి స్వల్పకాలం లోనే “వృత్తిరహితం” అవుతుంది
“యోగః శ్చిత్తవృత్తి నిరోధః”
అన్నారు కదా పతంజలి మహర్షి

“చిత్తం” అన్నది వృత్తిరహితమవుతూనే,
“కుండలినీ జాగృతం” అన్నది మొదలవుతుంది
కుండలినీ జాగృతమయి
చక్రాలన్నిటినీ ఉత్తేజితం చేసుకుని
సహస్రారాన్ని చేరుకున్నప్పుడు
అది అక్కడ సంపూర్ణంగా స్థితమైనప్పుడు
మనకు అత్యవసరమైనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు
ఏది కావాలి అంటే దాన్ని చూడగల శక్తి
వచ్చినప్పుడు .. “దివ్యచక్షువు సంపూర్ణంగా విప్పారింది” అంటాం

దివ్యచక్షువు పరిపక్వం చెందినప్పుడు
మనం కూడా “పరమగురువుల” కోవ లో చేరుతాం