ధ్యానం

 

ధ్యానం అంటే

ధ్యానం అంటే ప్రార్థన కాదు

ధ్యానం అంటే స్త్రోత్రం కాదు

ధ్యానం అంటే నామస్మరణ కాదు

ధ్యానం అంటే మంత్రజపం కాదు

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

ధ్యానం వల్ల లాభాలు

ధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి

ధ్యాన సాధన ద్వారానే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

ధ్యాన సాధన ద్వారానే ఏకాగ్రతాశక్తి తీవ్రతరమవుతుంది

ధ్యాన సాధన ద్వారానే మనఃశాంతి లభిస్తుంది

ధ్యాన సాధన ద్వారా ఆత్మస్థైర్యం కలుగుతుంది

ముక్తి

ధ్యాన సాధన ద్వారానే దివ్యచక్షువు ఉత్తేజితమవుతుంది

ధ్యాన సాధన ద్వారా మనమే గురువులుగా మారుతాం

ధ్యాన సాధన ద్వారా మనమే దైవస్వరూపాలమని తెలుసుకుంటాం

సత్యం

మన జన్మలను మనమే ఎన్నుకుని వచ్చాం

ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి

ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ ఉద్ధరించలేరు

సృష్టిలో కోటానుకోట్ల లోకాలున్నాయ

చావు

చనిపోవడం అంటే భౌతిక శరీరాన్ని వదలడమే

చనిపోవడం అంటే మన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చడమే

చనిపోవడం అంటే మరో నూతన ప్రపంచాన్ని చేరడమే

కర్మ సిద్ధాంతం

స్వంత కర్మఫలాలను అనుభవించే తీరాలి

మన చెడ్డే మనకు చెడును కలుగచేస్తుంది

మన మంచే మనకు మంచిని కలుగచేస్తుంది

జ్ఞానం

అందరి దగ్గరనుంచీ అన్నీ ఎప్పుడూ నేర్చుకుంటూ వుండాలి

సమయాన్ని క్షణమైనా వృధా ఎప్పుడూ చెయ్యరాదు

ప్రాణశక్తిని అణుమాత్రమైనా వృధా ఎప్పుడూ చెయ్యరాదు

ఈ వర్తమాన జన్మనే భూమండలంలోని ఆఖరి జన్మగా మలచుకోవాలి