“చావు” .. “నిద్ర” .. “ధ్యానం”

 

“చావు” .. ” నిద్ర ” .. “ధ్యానం”
ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక్క లాంటివే
ఇవన్నీ కూడా
మన స్థూలశరీరాన్ని మనం వదిలే చర్యలే 
శాశ్వతం గానో, అశాశ్వతం గానో 
మరి పూర్తిగానో, కొద్దిగానో .. మరి తెలిసో, తెలియకో

“చావు” లో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలివేస్తాం
“నిద్ర” లో మనకు తెలియకుండా శరీరం నుంచి బయటకు
వచ్చి కొన్ని గంటల తరువాత తెలియకుండానే తిరిగి శరీర ప్రవేశం చేస్తాం
” ధ్యానం ” యొక్క పరాకాష్ట లో మనం పూర్తి ఎరుకతో శరీరం వదిలి
సూక్ష్మదేహ యాత్రల తరువాత పూర్తి జ్ఞానంతో 
తిరిగి స్థూలదేహ ప్రవేశం చేస్తాం

* ధ్యానం వలన నిద్రావస్థలో చేసే యాత్రలు
అధికంగా జ్ఞాపకం వుంటాయి 
* అంతేకాకుండా ఆ యాత్రలు ఎక్కువ
ఉపయోగకారిగా కూడా వుంటాయి
* ధ్యానం ద్వారా మరణాంతర జీవితం గురించి 
మనకు పూర్తిగా అర్థం అవుతూ వుంటుంది.