బ్రహ్మజ్ఞానం

“జ్ఞానం” అన్నది రెండు రకాలు – ఆత్మజ్ఞానం; బ్రహ్మజ్జానం
“ఆత్మజ్ఞానం” అంటే – “నేను శరీరం కాదు ఆత్మను” అని తెలుసుకోవడం
“నేను శరీరాన్ని మాత్రమే” అనుకోవటం “అజ్ఞానం నెం.1”
“నేను శరీరం కాదు ఆత్మను” అని తెలుసుకోవడమే “జ్ఞానం నెం.1”
ఇకపోతే “మమాత్మా సర్వభూతాత్మ” అని తెలుసుకోవడమే
“జ్ఞానం నెం.2” అంటే “బ్రహ్మజ్ఞానం”
“నేను వేరే .. నువ్వు వేరే” అని గ్రహించేది “అజ్ఞానం నెం.2”

“అ – జ్ఞానం” అంటే జ్ఞానం లేకపోవటం
“అ – ధర్మం” అంటే ధర్మం కానిది
“అ-న్యాయం” అంటే న్యాయం కానిది
“అజ్ఞానం” నుంచి “సుజ్ఞానం” లోకి ప్రయాణించటమే “ఆధ్యాత్మికత”

బ్రహ్మజ్ఞానాలను నాలుగు విధాలుగా చెప్పుకుంటాం:

1. బ్రహ్మవిదిడు
2. బ్రహ్మవిద్వరుడు
3. బ్రహ్మవిద్వరీయుడు
4. బ్రహ్మవిద్వరిష్టుడు

“యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి” అని వుంది భగవద్గీతలో
అంటే .. “ఎవడు తనను తాను అంతటిలోనూ,
అంతటిలో తనను తాను చూసుకుంటాడో” అని అర్థం
ఇదే “బ్రహ్మజ్ఞానం”

ఆత్మజ్ఞాని అయినవాడు మరుక్షణంలో బ్రహ్మజ్ఞాని అవుతాడు
ఆత్మజ్ఞానిగా కావడమే బహుకష్టతరమైన విషయం
ఆ తరువాత బ్రహ్మజ్ఞాని కావడం సాధారణ విషయం
పిరమిడ్ మాస్టర్లందరూ బ్రహ్మజ్ఞానులే
“PSSM ” అన్నది బ్రహ్మజ్ఞానుల
విశేష కలయిక, విశేష సహజీవనం, విశేష సమూహం
బ్రహ్మజ్ఞానం అవతరించగానే అందరూ లోకకళ్యాణం కోసం
వెంటనే నడుము బిగిస్తారు .. PSSM మాస్టర్లు ..
లోకమంతా తామే అయి వున్నారు కనుక!
“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” అంటే
“బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు”
బ్రహ్మ అంటే సృష్టికర్త కదా
ప్రతి నూతన బ్రహ్మజ్ఞానీ “సహసృష్టికర్త” అవుతాడు
తనదైన శైలిలో నూతన సృష్టికి అంకితం అవుతాడు; నాంది పలుకుతాడు
పిరమిడ్ మాస్టర్లందరూ నవ- బ్రహ్మలు, నవ – సృష్టికర్తలు
ఆత్మజ్ఞానం జయహో!
బ్రహ్మజ్ఞానం జయహో!!
పిరమిడ్ మాస్టర్ జయహో!!!
PSSM జయహో!!!