బ్రహ్మజ్ఞానం-ఇంద్రియవశం
“రుచం బ్రహ్మం జనయంతో దేహా అగ్రే తదబ్రువన్,
యస్వైవం బ్రాహ్మణో విద్యాత్తస్వ దేవా అసన్ వశే”
– యజుర్వేదం (31-21)
| రుచం | = | ప్రీతికరం |
| బ్రహ్మం | = | బ్రహ్మణోపత్య మివ బ్రహ్మణః సకాశా జ్ఞాతం జ్ఞానం |
| జనయంత | = | ఉత్పాదయంతో |
| దేవా | = | విద్వాంసః |
| వాబ్రువన్ | = | బ్రువంతూపదిశంతుచ |
| యస్వై | = | యమునా ప్రకారేణ తద్ బ్రహ్మ |
| బ్రాహ్మణో | = | విద్యాత్ పశ్చాత్త్ స్వైవ |
| బ్రహ్మవిదో | = | బ్రాహ్మణస్య |
| దేవా | = | ఇంద్రియాణి |
| వశే | = | అసన్ భవంతి నాన్యస్యేతి |
“బ్రహ్మజ్ఞానం ఆనందదాయకం;
అది మనుష్యులకు బ్రహ్మం లో రుచి ని పెంచుతుంది;
ఆ బ్రహ్మజ్ఞానాన్నీ, దాని సాధనాలనూ,
విద్వాంసులు ఇతర మానవులకు ఉపదేశించి వారినీ ఆనందింప చేస్తారు.
ఏ మనుష్యుడు ఈ విధంగా బ్రహ్మంను తెలుసుకుంటాడో
అలాంటి విద్వాంసుడికి
మనస్సు మొదలయిన ఇంద్రియాలన్నీ వశంలో ఉంటాయి; ఇతరులకు వుండవు”
– స్వామి దయానంద – పండిత గోపదేవ్ ఆధారంగా