ఆత్మ = మౌలిక అసంతృప్తి + సాహసం = సంతృప్తి”

 

ఆత్మ యొక్క మౌలిక లక్షణం .. “అసంతృప్తి”

అందుకే ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవడానికి ఆత్మ ఎప్పుడూ .. నిరతం

అనేకానేక సాహసాలకు ఉద్యమిస్తూనే ఉంటుంది

అప్పుడే ఆత్మకు “సంతృప్తి” లభిస్తుంది.

“ఆత్మ” = అసంతృప్తి + సాహసం = “సంతృప్తి”

ఒకానొక భౌతిక శరీరాన్ని .. అది కూడా మానవ శరీరాన్ని ధరించి ..

“భూలోకానికి ప్రయాణం కట్టడం” అన్నదే

ఆత్మ చేసే ఒకానొక పరమాద్భుతమైన సాహసం

ఆ సాహసయాత్రలో అన్ని రకాల అనుభవాలనూ

అనుభూతి చెందుతూ మరిన్ని భూలోకయాత్రలకు పూనుకోవడం

“ఆత్మ” చేపట్టే మరింత గొప్ప సాహసం!

ఆ సాహసయాత్రల వల్లనే ఆత్మ “సంతృప్తి” చెంది ..

“పూర్ణాత్మ”గా .. “పరితృప్తాత్మ”గా మారి .. కారణలోకాలకూ

మరి మహాకారణలోకాలకు ప్రయాణమై వెళ్తుంది ..

ఇలా ఆత్మ ఎప్పుడూ సహాసాలకు సదా ఉద్యమిస్తూనే ఉంటుంది ..

మరి అలా ఉద్యమించిన ఆత్మస్వరూపులందరికీ

మరొక్కసారి “2018” నూతన సంవత్సర శుభాకాంక్షలు.