అయం లోకో నాస్తి పరః
“న సాంపరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యంతం విత్తమో హేన మూఢమ్;
అయం లోకో నాస్తి పర ఇతిమానీ
పునః పునర్వశమాపద్యతే మే”
= కఠోపనిషత్తు (2-6)
| సాంపరాయః | = | ఉత్తమ గతులు |
| విత్తమోహేన | = | ధన మదం చేత |
| మూఢమ్ | = | సమ్మోహితులైన వారికీ |
| ప్రమాద్యంతమ్ | = | జాగ్రత్త లేని వారికీ |
| బాలమ్ | = | బాలునికీ (వివేకం లేని వారికీ) |
| న ప్రతిభాతి | = | కనిపించనే కనిపించవు |
| అయమ్ లోకః | = | ఈ లోకం ; (అస్తి = ఉన్నది) |
| పరః | = | పరలోకం ; (న అస్తి = లేదు) ; |
| ఇతి | = | అని; |
| మానీ | = | భావించేవాడు; |
| పునః పునః | = | మళ్ళీ మళ్ళీ; |
| మే | = | నా యొక్క (మృత్యువు యొక్క) |
| వశమ్ | = | అధీనంలో; |
| ఆపద్యతే | = | పడిపోతాడు |
-
“జాగ్రత్త లేని బాలుడికీ .. ధనమదంతో మతిపోయినవానికీ . . శ్రేయోమార్గం ఎన్నటికీ కన్పించదు; ‘ఉన్నది ఈ లోకమే, మరో లోకం లేనే లేదు‘– అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ నా (మృత్యువు) చేతిలో పడుతూ ఉంటాడు” – (అని యముడు నచికేతునితో కఠోపనిషత్ లో అంటాడు)
= రామకృష్ణ మిషన్ ప్రచురణ