పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు

 

  ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడానూ ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఒక్క క్షణం కూడానూ ఆ నవరత్నాలను మస్తిష్కంలోంచి జారిపోకూడదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. రోజు రోజుకీ వాటి యొక్క అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వుండాలి. ఒక్కటేసారి వాటి యొక్క పూర్తి అవగాహన రాదు. “తినగ తినగ వేము తియ్యగనుండు; అనగ అనగ రాగము అతిశయిల్లును”. అదేవిధంగా ఈ యొక్క మూల సిద్ధాంతాలను గురించి మనం అనేక పుస్తకాల ద్వారా, అనేక ధ్యాన సాధనల ద్వారా, ఎంతో ఆలోచన ద్వారా, అందరి యొక్క అనుభవాలు వినడం ద్వారా ఏదో ఒకరోజు ఆ యొక్క, ఆ ఫిలాసఫీ యొక్క, ఆ పూర్ణ జ్ఞాన ప్రకాశం యొక్క పూర్తి రూపురేఖలు మనకి కూడా అనుభవానికి వస్తాయి. అప్పుడు మనం కూడా ఒక ‘పిరమిడ్ మాస్టర్’ అయినట్లు.

మెట్టమొదటిది – “నేనే అంతా”
రెండవది – “జీవుడే దేవుడు”
మూడవది – “దేహమే దేవాలయం”
నాల్గవది – “శ్వాసే గురువు”
ఐదవది – “సమయమే సాధన”
ఆరవది – “సహనమే ప్రగతి”
ఏడవది – “అనుభవమే జ్ఞానం”
ఎనిమిదవది – “దానమే ధర్మం”
తొమ్మిదవది – “ధర్మమే పుణ్యం”