భగవద్గీత 5-27

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః |

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ||

పదచ్ఛేదం

స్పర్శాన్కృత్వాబహిఃబాహ్యాన్చక్షుఃఏవఅంతరేభ్రువోఃప్రాణాపానౌసమౌకృత్వానాసాభ్యంతరచారిణౌ

ప్రతిపదార్థం

బాహ్యాన్, స్పర్శాన్ = బాహ్య విషయ భోగాలను ; బహిః ఏవ , కృత్వా = బయటికి పారద్రోలి ; = మరి ; చక్షుః = దృష్టిని ; భ్రువోః, అంతరే = భ్రూమధ్యంలో (నిలిపి); నాసాభ్యంతర చారిణౌ = నాసికారంధ్రాలలో సంచరిస్తున్న ; ప్రాణాపానౌ = ప్రాణ అపాన వాయువులను ; సమౌ, కృత్వా = సమంగా చేసి.

తాత్పర్యం

శబ్దస్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేసి, ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, నాసికారంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణ, అపాన వాయువులను సమానంగా చూడాలి. ”

వివరణ

నది ఒడ్డున ఉంటే నదిలోని కెరటాలు మనల్ని ఏమీ చెయ్యలేవు.

కానీనదిలోకి దిగితే అవి మనల్ని ముంచెత్తుతాయి !

అలాగేశబ్దస్పర్శాదిపంచేంద్రియవిషయాలతో

మనస్సు తాదాత్మ్యం చెందితేనే

అవి మనల్ని కలత పరుస్తాయి.

బాహ్యప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటకే

పంపించేసెయ్యాలిఅంతరప్రపంచంలోకి రానీయకూడదు.

అటూ ఇటూ దిక్కులు చూస్తేమనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది.

కనుక కళ్ళు రెండూ మూసుకోవాలి ;

తరువాతనాసికాగ్రంమీద దృష్టిని నిలపాలి.

నాసికాగ్రంఅంటే రెండు కనుబొమ్మల మధ్య గలభ్రూమధ్యం ” …

అంతేకానీ ముక్కుపుటాల దగ్గరి చివరి భాగం కాదు !

దృష్టినిఅంటేఅంతరదృష్టినిధ్యాసనుభ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి.

అందుకోసం ముందు ఉచ్ఛ్వాస లోముక్కు లోపలికి వచ్చే ప్రాణవాయువు.

ఇంకా నిశ్వాసలోబయటకు విసర్జించబడే అపానవాయువు

యొక్క చలనాలను నాసికలో సమానంగా గమనిస్తూ ఉండాలి.

అంటేనిరంతరంగా మనలో కొనసాగే శ్వాసక్రియను గమనిస్తూ ఉండాలి.

అలా చేస్తూ చేస్తూ ఉంటేశ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ

స్వయంగాభ్రూమధ్యంలోకి చేరుకుంటుంది.

తద్ద్వారా మనస్సు నెమ్మది నెమ్మదిగా ప్రశాంత స్థితికి

పరంపరగా శూన్యస్థితికి

అత్యంత సహజంగానే చేరుకుంటుంది.

శ్వాస తనంతట తాను భ్రూమధ్యంలోకి చేరే విధానమే  ఆనాపానసతి ”.