సత్సంగం సజ్జన సాంగత్యం

 

“సత్ + సంగం” = “సత్యం తో కలయిక”
“సత్” అంటే “నిత్యమైనది”
అంటే,
“ఏ కాలంలోనైనా చెడకుండా ఉండేది” అన్నమాట
నిజానికి “ఆత్మ” అన్నదే నిత్యం, శాశ్వతం, సనాతనం
కనుక “ఆత్మ” అన్నదే ఏకైక సత్యం
“సత్సంగం” అంటే “సత్యంతో నేరుగా కలయిక”
“సత్యంతో కలయిక” అంటే “ఆత్మతో నేరుగా కలయిక”
ఆత్మలో ఏవిధంగా కలుస్తాం?
కేవలం ధ్యానసాధన ద్వారానే.
ధ్యానస్థితిలోనే ఆత్మతో ఆత్మ కలసి వుంటుంది
ధ్యానంలో మాత్రమే మనం మనతో కలిసి వుంటాం ;
కనుక, “ధ్యానం” లో వుండడమే “సత్సంగం” అన్నమాట.

“సత్ + జనులు” = “సజ్జనులు”
అంటే “సత్యం తెలుసుకున్న జనులు”
కనుక,

“సజ్జన సాంగత్యం” అంటే ‘సత్యం తెలుసుకున్న జనులతో కలవడం’
“సజ్జన సాంగత్యం” అంటే జ్ఞానుల ద్వారా సత్యప్రవచనాలు వినడం
“సజ్జన సాంగత్యం” అంటే యోగుల ద్వారా ధ్యానానుభవాలు వినడం
శ్రీ ఆదిశంకరాచార్యులవారు “భజగోవిందం” లో
“త్రిజగతి సజ్జన సంగేతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా” అన్నారు . . అంటే
“మూడు లోకాల్లో కూడా ఏ లోకానికి పోయినా, యోగులతో కలవాల్సిందే ;
ఆ విధంగా పొందిన జ్ఞానసాగరమే మనల్ని తరింపచేయగలదు” అని

“సత్సంగం ” వేరే, “సజ్జన సాంగత్యం” వేరే
* “సత్సంగం” అంటే “ధ్యానం”
* “సజ్జన సాంగత్యం” అంటే “యోగులతో సంపర్కం”
* “సంఘం శరణం గచ్ఛామి” అనబడింది బుద్ధ ధర్మంలో . .
“సంఘం” అంటే “సజ్జనులు సంఘం” అంటే “యోగుల సంఘం”
అన్నమాట