భగవద్గీత 4-39

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |

జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ||

 

పదచ్ఛేదం

శ్రద్ధావాన్లభతేజ్ఞానంతత్పరఃసంయతేంద్రియఃజ్ఞానంలబ్ధ్వాపరాంశాంతింఅచిరేణఅధిగచ్ఛతి

ప్రతిపదార్థం

సంయతేంద్రియః = జితేంద్రియుడు ; తత్పరః = సాధనా పరాయణుడు ; శ్రద్ధావాన్ = శ్రద్ధ గలవాడు ; జ్ఞానం = ఈ తత్త్వజ్ఞానాన్ని ; లభతే = పొందుతాడు ; జ్ఞానం, లబ్ధ్వా = () జ్ఞానాన్ని పొంది ; అచిరేణ = తత్ క్షణమే ; పరం, శాంతిం = పరమ శాంతిని ; అధిగచ్ఛతి = పొందుతాడు.

తాత్పర్యం

ఇంద్రియాలను జయించి శ్రద్ధాసహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్నీ, దానిని పొందిన శీఘ్రకాలంలోనే పరమశాంతినీ పొందుతాడు. ”

వివరణ

శ్రద్ధ .. సాధనా పరాయణత్వం .. ఇంద్రియ నిగ్రహం

ఇవన్నీఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నవి.

మనస్సు, ఇంద్రియాలు వశమయ్యేటందుకూ,

మరి ఆత్మజ్ఞానాన్ని పొందడానికీ,

సంపూర్ణంగా ఆత్మతత్వం గ్రహించడానికీ

శ్రద్ధతో, తదేక దీక్షతో

ధ్యానసాధన అన్నది చేస్తూనే, చేస్తూనే ఉండాలి.

అప్పుడే జ్ఞానం

బ్రహ్మజ్ఞానంకలుగుతుంది

తద్వారా పరమశాంతి లభిస్తుంది.

శ్రద్ధ లోపిస్తే, సాధన కుంటుబడితే, విషయాసక్తి పెరిగితే

పతనం తప్పదు.