భగవద్గీత 2-41

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన  |

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్ || ”

 

పదచ్ఛేదం

వ్యవసాయాత్మికాబుద్ధిఃఏకాఇహకురునందనబహుశాఖాఃహిఅనంతాఃబుద్ధయఃఅవ్యవసాయినాం

ప్రతిపదార్థం

కురునందన = అర్జునా ; ఇహ = యోగంలో ; వ్యవసాయాత్మికా = నిశ్చయాత్మకమైన ; బుద్ధిః = బుద్ధి ; ఏకా (భవతి) = ఒక్కటే ఉంటుంది ; అవ్యవసాయినాం = (కానీ) స్థిరబుద్ధి లేనివారి యొక్క ; బుద్ధయః = బుద్ధులు ; హి = నిశ్చయంగా ; బహుశాఖాః = అనేక విధాలుగా ; = మరి ; అనంతాః = అంతులేని (కోరికలుగల)వై(ఉంటాయి)

తాత్పర్యం

అర్జునా ! యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏక కారణంగా ఉంటుంది; నిశ్చయ వివేకం లేనివారి జ్ఞానం అనేక విధాలుగా అనంత ముఖాలుగా వుంటుంది. ”

వివరణ

యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే

అంత ఫలితం తప్పకుండా ఉంటుంది.

యోగాన్ని ఆచరించాలంటే కావలసింది

స్థిరమైన, నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే !

స్థిరత్వం లేని బుద్ధులు లెక్కకు మించి అనేకంగా ఉంటాయి.

పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే

మనస్సు పరిపరి విధాల పరుగులు తీస్తుంది.

లక్ష్యం నిర్ణయించుకుని

నిశ్చయాత్మకమైన, స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే

లక్ష్యసాధనలో విజయం సిద్ధిస్తుంది.

నియంత్రించబడని, నిగ్రహించబడని మనస్సు 

పరిపరి విధాల పరుగులు పెడుతూ వుంటుంది.

నియంత్రించబడిన, నిగ్రహించబడిన మనస్సుబుద్ధిఅనబడుతుంది.

అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది.

స్థిరమైన, నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగసాధన

స్వల్పమైనా మహాభయం నుంచి రక్షిస్తుంది.