భగవద్గీత 2-69

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || ”

 

పదచ్ఛేదం

యానిశాసర్వభూతానాంతస్యాంజాగర్తిసంయమీయస్యాంజాగ్రతిభూతానిసానిశాపశ్యతఃమునేః

ప్రతిపదార్థం

సర్వభూతానాం = సమస్త ప్రాణులకు ; యా = ఏదైతే ; నిశా = రాత్రితో సమానమో ; తస్యాం = దానియందు ; సంయమీ = స్థితప్రజ్ఞుడైన యోగి ; జాగర్తి = మేల్కొని ఉంటాడు ; యస్యాం = దేనిలో ; భూతాని = సకలప్రాణులు ; జాగ్రతి = మేల్కొని ఉంటాయో ; పశ్యతః = పరమాత్మతత్త్వాన్ని తెలుసుకోవాలనుకునే ; మునేః = మునికి ; సా = అది ; నిశా = రాత్రి

తాత్పర్యం

సమస్త ప్రాణులకూ ఏది చీకటిరాత్రో దానిలో జ్ఞాని మెలకువతో వుంటాడు ; సామాన్యులకు మెలకువతో వుండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది. ”

వివరణ

ఒకానొక అజ్ఞాని ఇంద్రియ విషయ భోగాలపట్ల ఆసక్తి కలిగి ఉంటాడో

అశాశ్వతమైన సుఖదుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటాడో

ఒకానొక జ్ఞాని వాటిపట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు.

సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా, అనాసక్తిగా ఉండే పారమార్థిక, ఆత్మతత్త్వ 

విషయాలలో ఒకానొక జ్ఞాని ఆసక్తిని కలిగి మెలకువగా ఉంటాడు.

అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాలను

ఒకానొక యోగి వ్యర్థమైనవిగా, రాత్రిగా భావిస్తాడు.

అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని … 

తన యోగసాధననుధ్యాన సాధనను కొనసాగించే పగలుగా భావిస్తాడు.

రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానం చెప్పారు.

లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు.

వీళ్ళంతా వివిధ వృత్తులలో, వివిధ ఉద్యోగాలలో, వివిధ స్థాయిలలో ఉంటారు.

ఒకరు జమీందారు, ఒకరు సంసారి

ఒకరు అధికారి, ఒకరు కళాకారుడు

వీరంతాసున్నా వంటివారు

సున్నాకి తనంతట తనకు విలువ ఉండదు.

దాని ముందు ఒకటి పెడితేనే సున్నాకు విలువ.

అలాగే మనుషులకు ఆత్మవిద్య

యోగత్వం ఉంటేనే విలువ.

అది లేకపోతే వారుసున్నాతో సమానమే.

కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి.

తరువాతనే ప్రాపంచిక విద్య అయినా రాణించేది

కనుకనే

అజ్ఞానులు మేలుకుని ఉండే విషయభోగాలలోజ్ఞానులు నిద్రిస్తారు.

అజ్ఞానులు నిద్రపోయే ఆత్మవిషయంలోజ్ఞానులు మేలుకుని ఉంటారు.