భగవద్గీత 4-19

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |       

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ||

 

పదచ్ఛేదం

యస్యసర్వేసమారంభాఃకామసంకల్పవర్జితాఃజ్ఞానాగ్నిదగ్ధకర్మాణంతంఆహుఃపండితంబుధాః

ప్రతిపదార్థం

యస్య = ఎవరి యొక్క ; సర్వే = సమస్త ; సమారంభాః = కర్మలు ; కామసంకల్ప వర్జితాః = కోరిక , సంకల్పాలు ఉండవో ; జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం = జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైన కర్మలు కల ; తం = అతనిని ; బుధాః = జ్ఞానులు ; పండితం = పండితుడు అని ; ఆహుః =అంటారు.

తాత్పర్యం

ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక, సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వానిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు. ”

వివరణ

కర్తృత్వభావన లేకుండా, కర్మఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలనునిష్కామకర్మలుఅంటారు.

కర్మల గురించిన కర్తృత్వం లేకపోవడంఅంటే

నేనే చేస్తున్నాను ఈ పనినిఅనే భావం లేకపోవడం.

కర్మఫలాసక్తి లేకపోవడం అంటేఫలితంతో నాకు సంబంధం లేదు;

కర్మ చేయడమే నా ధర్మంఅనే భావంతో కర్మలు చెయ్యడం.

నిష్కామకర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది.

చిత్తశుద్ధి కలవాడికి ధ్యానసాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది.

ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని

జ్ఞానాగ్నిప్రజ్వరిల్లుతుంది.

నిష్కామకర్మలు చేసేవానికి

ఆగామి కర్మ ” …

ప్రస్తుతపు పని వలన సంప్రాప్తించే కర్మ ” … ఏమీ ప్రాప్తించదు.

తద్వారాసంచితకర్మకు ” …

ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు

అదనంగా ఏమీ జమ చేయబడదు.

ఇకప్రారబ్ధకర్మఅనేది

ఈ జన్మకు వచ్చే ముందు వరకూ ఉన్నసంచిత కర్మలలోంచి

ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ.

అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే,

మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు

సమస్త కర్మలూ దగ్ధమైనందువల్ల

అవి దుఃఖంనిచ్చే శక్తిని కోల్పోతాయి.

వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవీ మిగిలి ఉండవు.

వర్తమానకర్మలు ఏమీ లేకుండా, వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా

ఆగామి, సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడినే

పండితుడుఅని చెపుతారు జ్ఞానులు, బుధులు, విజ్ఞులు.

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ’ …

జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి.

ఈ జ్ఞానం అనేదిఆత్మజ్ఞానం ”.

ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి .. ధ్యాన సాధన చేయాలి

ధ్యాన సాధన ద్వారా పండాలి

పండితుడు కావాలి !